ముఖము, వికసిల్లంగాన్ = విరియఁబాఱఁగా, తనచేతిచెఱఁగు = తనచేతఁ గైకొన్న యాతని ఉత్తరీయపుఁగొంగును, బిగియన్ = బిగియునటులు, పెనఁచుచున్ = చేత మెలివేయుచు, నగవు, బెరయఁగన్ = కలుగఁగా, తల వాంచి = తల వంచుకొని, పలికెన్ = ఈవిధముగా నొక్కమాట పలికెను.
| శా. | హా నీనిష్ఠురవృత్తి మాని కరుణైకాయత్తచిత్తంబునన్ | 107 |
టీ. విప్రోత్తమా = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా! హా = ఔరా, (ఆఁ = సరే యని పా.) నీనిష్ఠురవృత్తిన్ = నీకాఠిన్యమును, మాని = విడిచి, కరుణైకాయత్తచిత్తంబునన్ = దయకే యధీనమయిన మనస్సుతో, కేవలదయాస్వభావముతో, మానన్‌చాలను = విడువలేను, అటంచున్, నేఁడు, శ్రవణానందంబుగాన్ = చెవులపండువుగా, పల్కుటన్ = అనుటచేత, సూనాస్త్రున్ = మదనుని, వెల పెట్టక = జీతము బత్తెము నీయక, ఏలితిన్ = బంటుగా నేలుకొనఁగలిగితిని, సుఖార్ణోరాశిలోన్ = సౌఖ్యసముద్రమున, క్రుంకితిన్ మునిఁగితిని. నానోముల్ = నావ్రతములు, ఫలియించెన్ = పండెను. నావయసు = నాయౌవనము, ధన్యము = కృతార్థము, అయ్యెన్ = ఆయెను. (క్రుంకితిన్ అనుచోఁ జొక్కితిన్ అనియు నావయసు అనుచో నాకులము అనియుఁ బాఠాంతరములు.)
తా. భూసురవర్యా! ఎన్ని చెప్పినను మునుపటివలెఁ గఠనభావము వహించి నన్ను ఖేదపఱుపక, నేఁడు దయ దాల్చి నిన్ను విడువఁజాల నని పల్కుటచే మన్మథుని జీతబత్తెములు లేనిబంటునుగా నేలితిని సుఖసముద్రమున మునిఁగితిని. నానోములు పండినవి. నా ప్రాయము కృతార్థమయ్యెను.
అలం. రూపకాలంకారము.