ఒక్కటే తహతహన్ = (తల్లిదండ్రులు మొదలగువా రేమైరోయను) నెడతెగనివిచారముచే, కేళిపైన్ = భోగముమీఁద, మనసు, ఒగ్గదు = పోదు. సంభోగేచ్ఛ జనింపక యున్నది! మనసి = మనస్సు, అనాశ్వాసిత = ఊఱట లేనిదియు, దుఃఖితే = దుఃఖము నొందినదియు నగుచుండ, సర్వం = ఎల్లను, అసహ్యం = రోఁత గలదే, అనాన్ = అనఁగా, ఎఱుగవే = నీవు విని యెఱుంగవా?
రతి యన “యూనోరన్యోన్యవిషయాస్థాయినీఛ్ఛారతిర్భవేత్" ఆలంకారికనిర్వచనము. ఇది నరసభూపాలీయమునందు “సంభోగవిషయ మగు నభిలాషస్ఫురణము మనములఁ బొడమిన ధరలో నది రతి" అని చెప్పఁబడెను.
తా. ఉవిదా! నాపల్కు వినుము. ప్రేమతో నీవు కౌఁగిటఁ జేర్చుకొనఁగలుగునానంద మాయింద్రునకైనఁ గలుగదు. నీ విట్లు నన్నుఁ ప్రేమించుచుండఁగాఁ గూడ దని పెనఁగులాడుటకు నే నేమి సన్న్యాసినా? 'ఇ ల్లే మయ్యెనో? తలిదండ్రు లేమైరో? కులకాంత యెట్లుండెనో?' అను పెద్దతహతహచే మనసు గొల్పకున్నది. ఎఱుఁగవా? "అనాశ్వాసితదుఃఖితే మనసి సర్వ మసహ్యమ్” (మనస్సు ఊరట లేక చింతిలుచుండఁగా సర్వమును నసహ్యమగును) అనుపల్కును. అట్టి వెతయే నాకు లేకున్నచో నాకయి నేను నీకొఱకు వెదకికొనుచు రాకయుందునా?
అలం. అర్థాంతరన్యాసము, అర్థాపత్తి, ప్రతిషేధము.
| క. | ఐనన్ గానిమ్ము భవ | 100 |
టీ. ఐనన్ = అటులైనను, కానిమ్ము = కానీ, నామనసు ఎటు లున్నను దానిం గూర్చి విచారింపను. భవద్దీనతకై = నీదీనత్వమును జూచి,