Jump to content

పుట:Manu Charitra.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లేమిని, ఒంది = పొంది, పాడువడి యని యొక రర్థము చెప్పిరి, సొంపుచెడఁగాన్ = నిండుతనము మాయఁగా, ఇచ్చోటన్ = ఇక్కడ, నేన్ = నేను, చిక్కి = చిక్కుకొని, ఏసుఖమతిన్ = ఎట్టిసుఖేచ్ఛతో, భోగించెదన్ = నీతో సంభోగింతునో, చెప్పవే = నీవే చెప్పుము.

తా. ఉవిదా! నేను తమకన్నులయెదుట లేక యీకాననిక్రంతలయం దుండుటచే నాతల్లిదండ్రులు నాయునికి తెలియక చింతిల్లుచుండ, నాభార్య వియోగదుఃఖ మనుభవించుచుండఁగా, యాజ్ఞికాగ్నులు చల్లారిపోఁగా, గృహము పాడ్వడఁగా, నే నిక్కడఁ జిక్కి యుండి సౌఖ్య మె ట్లపేక్షింతును? ఎట్లు నీతో భోగము లందుదును? నీవే చింతింపుము.

ఆర్తి యన విరహతాప మని నరసభూపాలీయమునం దొసఁగఁబడిన యుదాహరణము.

క. “బెడిదపుమదనజ్వరమున, మిడిసిపడున్ హారలతలు మృగలోచనకున్
    వెడవిలుతునింటికోలల, వడువున సతి నింక నేచవలదు నృసింహా.”

(ఆశ్వా. 3.)

ఉ.⁠

ఓసరసీరుహాక్షి, వినవో రతిఁ గౌఁగిట నీవు చేర్చునిం
పాసురభర్తకైనఁ గలదా వల దంచుఁ బెనంగ నేను స
న్యాసినె యొక్కటే తహతహన్ మన సొగ్గదు కేళిపై 'ననా
శ్వాసితదఃఖితే మనసి సర్వ మసహ్య' మనా నెఱుంగవే.

⁠ 99

టీ. ఓసరసీరుహాక్షీ = తామరపూవులవంటి కన్నులు గల వరూధినీ! వినవో = విన్నావుకావా, రతిన్ = సంభోగమునందు, నీవు కౌఁగిటన్ చేర్చునింపు = నీవు కౌగిలించుకొనఁగాఁ గలుగునానందము, ఆసురభర్తకైనక్ = ఆయింద్రునకైనను, (సర్వసౌఖ్యముల ననుభవించునట్టి యింద్రునికేని యనుట) కలదా; వలదు = అక్కఱ లేదు, అంచున్ = అని, పెనంగన్ = పెనఁగులాడుటకు, ఏను = నేను, సన్న్యాసినె = సన్న్యాసినా యేమి,