బడివినఁబడనియట్లు) ఇట్టులు = ఈవిధముగా, అనియెన్ = ఈరీతిగాఁ బ్రత్యుత్తరము నొసంగెను.
ఆయాశృంగారలక్షణము నుపాయాంతరములచే మాటుపఱచుటయే గాక తాను పరకాంతావిముఖుఁ డని తెలియుటకు మౌనముద్ర తలవంచుట బొటనవ్రేలు వ్రాయుట సలిపెను. ఇందుచే గంధర్వకుమారుఁడు జాణ యని గ్రహింప నగును.
తా. ఆప్రవరవేషముఁ దాల్చిన గంధర్వుఁ డప్పుడు (నిజముగా బ్రవరుఁ డనిపించుటకై) స్త్రీలతోఁ గలసి మెలసి యుండుటచే గడిదేఱిన యుదుటుఁజూపులను ఱెప్పలలోనే యడఁచెను. ముఖమునఁ దోతెంచు చిఱునవ్వును గప్పిపుచ్చెను. శరీరమునఁ గన్పట్టు శృంగారచేష్టలయుద్రేకమును లేనిపోనిమౌగ్ధ్య మభినయించి డాఁచెను. మోహరసము మీఱివచ్చెడు నర్మవచనములను నాల్క దాఁటనీయకే గ్రుక్కగొనెను. తల వాంచి యుస్సు రని మౌసము దాల్చి కాలిబొటనవ్రేలితో నేల రాయుచు నేమేమో లోలోఁ జింతించి యల్లన తల యెత్తి సన్నగొంతుతో నవ్వల ని ట్లనియెను.
| శా. | తల్లిందండ్రియు నన్నుఁ గాననిమనస్తాపంబునం బొక్కఁగా | 98 |
టీ. ఓఫుల్లాంభోరుహనేత్ర = వికసించిన తమ్మిపూవువంటి కన్నులుగలదానా! వరూథినీ! తల్లిందండ్రియున్ = తల్లిదండ్రులు, నన్నున్, కానని మనస్తాపంబునన్ = చూడమిచేఁ గలిగిన మనస్సులోని చింతచేత, పొక్కఁగాన్ = పరితపించఁగా, ఇల్లాలు = భార్య, ఆర్తిన్ = వియోగవ్యథచే, కృశింపఁగాన్ = దిక్కఁగా, సవనవహ్నిశ్రేణి = యజ్ఞాగ్నులవరుస, త్రేతాగ్నులు, చల్లారఁగాన్ = ఆఱి చల్లఁబడిపోవఁగా, ఇల్లున్ = గృహమును, శూన్యతన్ =