| తే. | గటకటా యనునపుడ గద్గదిక వొడమెఁ | 91 |
టీ. తొలుదొల్తన్ = మునుముందు, వానిన్ = ప్రవరవేషధారియగు గంధర్వకుమారుని, కన్నులన్ = కన్నులతో, కాంచినప్పుడ = చూచినప్పుడే, పల్లవాధరగుండె = చివురువంటిమోవి గల వరూథిని డెందము, జల్లుమనియెన్ = చలించెను. జల్లు అనుట ధ్వన్యనుకరణము. అటన్ = అవ్వల, రెండుమూఁడు, అంజలు = అడుగులు, అరుగునప్పుడు = చనునప్పుడే, పంకజాక్షికిన్ = పద్మములఁ బోలు కనులుగల వరూథినికి, కాళ్లన్ = అడుగులందు, తొట్రుపాటు = తడబాటు, కదిరెన్ = కలిగెను, డాయంగన్ = చేర, చనునప్పుడ = పోవునప్పుడే, ముఖాంబుజంబునన్ = ముఖపద్మమున, కంబుకంధరకున్ = శంఖమువంటిమెడ గల వరూథినికి, దైన్యంబు = బీదతనము, మనస్సులోనివిచారముచే బయటికిఁ దోఁచిన వెలవెలపాటు, తోఁచెన్ = కనఁబడెను. కదిసి = డగ్గఱి, నిల్చినయప్డ = నిలుచున్నసమయమునందే, లలనకున్ = వరూథినికి, మిగులన్ = విస్తారముగా, కనుదోయిఱెప్పలన్ = రెండుకన్నులఱెప్పలకు, చంచలత = చాంచల్యము, బెరసెన్ = కలిగెను. కటకటా = అయ్యో! ( మోసపుచ్చితివి గదా) అనునపుడ = అనుచునున్నపుడే, గద్గదిక = డగ్గుత్తిక, పొడమెన్ = జనించెను. చెఱఁగు = (వాని)వస్త్రపుఁగొంగును, పట్టినయపుడ, లేఁజెమట = చిఱుచెమట, క్రమ్మెన్, సొలసి = సొక్కి, మాటాడన్, ఉంకింపన్ = యత్నించుటకు, తలఁచి, మోము = (వాని)ముఖము, తేరకొని = తేరఁబాఱి, చూచునపుడ = తిలకించునపుడే, కన్నీరు = బాష్పములు, పొడమెన్ = పుట్టెను. విచారముచేఁ గ్రమ్మెను.