| ఉ. | వాడినమోముఁదమ్మి తెలివాలికకన్నులు విన్నఁ బోవఁ దో | 86 |
టీ. అలజోటి = ఆస్త్రీ (వరూథిని), వాడినమోముఁదమ్మి = (విరహాతిశయముచే) సోలినపద్మమువంటి ముఖమును, తెలివాలికకన్నులు = తెల్లనైన నిడుపులైన కన్నులు, విన్నఁబోవన్ = కళ దప్పియుండగా, తోన్ = కూడ, ఆడక = (జలక్రీడ) సల్పక, నెన్నొసల్ = నిండునొసలు, కరమునందున్ = అరచేతిలో, ఇడి = ఉంచి, తీరనిషణ్ణ = ఒడ్డునఁ గూరుచున్నది, జలంబు ఆడఁగన్ = జలవిహారము సేయుటకు, పిల్చువారిన్ = పిలుచుచున్న చెలిమికత్తియలను, ఒకహస్తపుమ్రొక్కునన్ = (నొసలు పెట్టుకొన్న చేయిగాక రెండవ) ఒంటిచేతిమ్రొక్కుతో, ఆడుఁడు అంచున్ = మీరు సల్పుఁడు (నేను రాను అని, తాన్, చూడక = ఎదిరివస్తువును గ్రహింపక, చూచుచూడ్కిన్ = చూచెడు రిత్తచూపులతో, దెసల్ = దిక్కులు, పరికింపన్ = చూడఁగా,ఒక్కచోన్. పైపద్యముతో నన్వయము.
స్తంభాదులు సాత్వికలక్షణములు; అవి యెనిమిది. కన్నులు చిన్నవోవుట మోము వాడుటయు సాత్వికలక్షణములలోఁ జేరినవనుటకు నాధారము.
"స్తంభ ప్రళయ రోమాంచాః స్వేదో వైవర్ణ్య వేపథూ
అశ్రు వైస్వర్య మిత్యష్టౌసాత్త్వికాః పరికీర్తితాః”
(సాహిత్యచింతామణి)
దెసలు పరిశీంచుట చెలులు చెప్పినమాటను బట్టి ప్రవరుఁ డెటనేని కానవచ్చునేమో యని, మ్రొక్కుతోఁ బ్రత్యుత్తరము నొసంగుట విరహాతిశయమునఁ బలుకనోడి.
తా. ఆవరూథిని విరహాతిశయముచేత వెలవెలఁబోయినమోము గలదై తక్కు చెలులతో జలక్రీడ సల్పక వామహస్తమున నొనలు చేర్చుకొని