Jump to content

పుట:Manu Charitra.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

xxvi 'కాఁగిలది యెక్కడ హా విధి యేమిసేయందు ' కౌఁగిలి అది, అనుచో నికారసంధి కావింపఁబడినది. 'ఆనాశ్వాసిఠదుఃఖితే మనసి సర్వ మసహ్య మన న్నెఱంగవే' ఇచ్చో “అనన్నెఱుంగవే” యని పోతన్న గారు ప్ర యోగించెడు. తెఱఁగునఁ బ్ర యోగింపఁబడినది. ఈసంధి సమంజస మైనది కాదు. అమృతరసపూర మగు పెద్దన్న గారి సరసకవితా ప్రసారమున నీ నలుసులు పరిగణనీయములుగావు. ఆనెఱిఁగి యాంధ్రకవనము నీతఁడు కూర్పఁగల్గిన ట్లిటీవల నెవ్వరును గూర్పనేక రై రి. కొంటె కోణంగి యగు కవిచౌడప్పయును దన వెక్కిరింపు, స్వభావమును మాని, క. పెద్దనవలెఁ గృతి సెప్పినఁ, బెద్దనవలె నల్పక వినిఁ బె ద్దనవలెనా? యెద్దనవలె మొద్దనవలెఁ, గ్రద్దనవలెఁ గుందవరపుఁ గవిచౌడప్పా! అని పెద్దనార్యునిగూర్చి తన మెప్పును వెల్లడించెను. కృష్ణ రాయలవంటి రాజ చూడామణిని పెద్దనార్యునివంటి విద్వత్కవి రత్నమును గాంచుభాగ్య మాంధ్ర దేశమున కిఁక నెన్నఁటికైనఁ గలుగఁగలదా! ఉ. కూర్చిన కూర్పులా! స్వరస గుంభనముల్, కవితా ప్రసారమా తేర్చినతేనె! యంచు విను తింపఁ బ్రబంధము సంతరించి లో కార్చితుఁ డైన పెద్దనమ హాకవిసత్క వితావిలాశముం