| ఆ. | కొమ్మ కన్నుఁగవకుఁ గోరగింపఁగఁ బూచి | 78 |
టీ. కొమ్మ = బాలా! కన్నుఁగవకున్ = కందోయికి, కోరగింపఁగన్ = వెక్కస మగునట్లు, కనులారఁ జూడ వీలుగాని యటుల, పూచి = పుష్పించి, తఱుచుజొత్తు = ఎక్కువరక్తిమను, క్రక్కుదాసనంబు = వెలిపఱుచు దాసానిచెట్టు, కవియు = క్రమ్ముకొను, ఈతమాలగహనాంధకారవితానమునకున్ = ఈచీకటిమ్రాఁకులతోఁపులోని చీకటితుండమునకు, ఉదయభానుఁడు = ఉదయించుచున్న సూర్యుఁడు, అయ్యెన్ = ఆయెను.
దాసానిపువ్వులు మిగుల నెఱ్ఱఁగా నుండును గాన నుదయించు సూర్యునివలె నుండెను. తమాలవృక్షములు చీకటులవలె నల్లగా నుండెను.
తా. బాలా! ఎఱ్ఱఁగాఁ బూచి యుండిన యీదాసానిచెట్టు చీకటిమ్రాఁకు లనుగాఢాంధకారమునకు నుదయభానునిపగిది యయ్యెను. (ఎఱ్ఱఁగాఁ బూచియుండిన దాసానిపూలకాంతి చీకటిచెట్లనలుపును విరజిమ్ముచున్న దనుట).
అలం. రూపకాలంకారము.
| తే. | శ్యామలోపరినిబిడపత్త్రాభ్రములకుఁ | 79 |
టీ. పంకరుహనేత్ర = పద్మనయనా, శ్యామలో...భ్రములకున్ - శ్యామల = పసుపు మీఱిన నల్పుకల, ఉపరి = మీఁది, నిబిడ = తఱచైన, పత్త్ర = ఆకు లనెడి, అభ్రములకున్ = మేఘములకు, కాండషండంబు = బోదెలసమూహము, దిగువానికాళ్లు గాఁగన్ = (నేలపైకి) దిగువర్షధారలు కాఁగా,