Jump to content

పుట:Manu Charitra.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాయనుచుమీ! అల్ల మధుఁడు = ఆవసంతుఁడు, ఈనీడన్ = ఈచెట్లనీడచే, ఘర్మ...స్ఫూర్తిన్ - ఘర్మ = గ్రీష్మముయొక్క, సామీప్య = చేరికచే, సంకలిత = చేకుఱిన, దాహస్ఫూర్తిన్ = తాపపుహెచ్చును, అఁగుఁబో = అణఁచును చుమీ! ఓషధీశుఁడు = చంద్రుఁడు, ఈతేనెన్ = ఈపూఁదేనెచే, గరళ...కటుకత్వము - గరళ = విషముయొక్క, సోదర్య = తోఁబుట్టుతనముచే, ఆత్త = పొందఁబడిన, కర = కిరణములయొక్క, సుధా= అమృతమందలి, కటుశత్వము = చేఁదును, ఉడుపుఁబో = పోఁగొట్టుకొనునుజుమా! అనఁగన్ = అనునట్లు, చంపక...తరులసొబగున్ - చంపక = సంపంగి, కురవక = గోరంట, పనస, తినిశ = నెమ్మి, నిచుళ = ప్రబ్బలి, పంజుళ = అశోకము, దాడిమీ = దానిమ్మ, విచికిల = సన్నమల్లె, ఆమ్ర = మామిడి, పాటలీ = కలిగొట్టు, పూగ = పోఁక, కేసర = సురపొన్న, ప్రముఖ = మొదలైన, తరులన్ = చెట్లచే, సొబగు = సొగసు, మీఱ = అతిశయించు, ఉద్యానము = విహారశృంగారవనమును, చొచ్చి = ప్రవేశించి, అచటన్ = అక్కడ, పైపద్యముతో నన్వయము.

అలం. అప్రస్తుతప్రశంసోత్ప్రేక్షలు.

తుమ్మెదలరవమును పాట యని చెప్పుటకలదు. దృష్టాంతములు —

క. “వీనులవిందై యమృతపుసోనలపొందై యమందసుమచరదళినీ
    గానము క్రందై యారవ మానందబ్రహ్మమైన నధిపతి బలికెన్.

(వసు. ద్వితీ.)

శా. "భృంగా కృష్ణుఁడు మంచివాఁ డనుచు సంప్రీతిన్ బ్రసంగించెదీ
    సంగీతంబున మేము సొక్కుదుమె.”

(భాగవ. దశ.)

సీ. “మాధవీమధుపానమత్తాలినీగాన
              విభవాకులోద్యానవీథులందు”

(కవికర్ణరసాయనము)

తా. ఈ తోటలోని గోరంట సంపెఁగ పనస మామిడి సురపొన్న మొదలుగాఁ గల వృక్షములవలని ఫలపుష్పపరిమళములచేత దుమ్మెదల