| | డనలాక్షుపెడబొబ్బ నలమినతలదిమ్ము | |
| తే. | డనఁగఁ జంపకకురవకపనసతినిశ | 73 |
టీ. మలయపవనుఁడు = మలయమారుతమునుండి వచ్చుచల్లగాలి, దక్షిణపుదిక్కునుండి వచ్చు గందపుఁదావి గలగాలి, ఈతావిన్ = ఈపరిమళముచే, ఉరగ...గంధమున్ - ఉరగ = పాములయొక్క, ఫూత్కార = బుసలవలనఁ గలిగిన, ధూమ = పొగచే, ఉగ్ర = వేండ్ర మగు, గంధము = వాసనను, పాసి, పొలయుఁబో = ప్రసరించుఁ జుమీ, పాములవిసము అగ్ని గాన బుసకొట్టుటలు పొగలుగాఁ జెప్పఁబడెను. విసము అగ్నిగఁ జెప్పుదు రనుటకు “విసపుఁజి చ్చొండొండ దెసలు వ్రేల్వ”. ఫూత్కృతులనుండి పొగలు వెడలు ననుటగూడ నిటులె సుసుప్రసిద్ధము —
తే. "పొదలుతనఫూత్కృతులనెల్లఁ బొగలు గవిసి
యబ్జజాండ మూదరవెట్టినట్టు గాఁగ
కాలకర్కశకాయుండు.”
(హరివంశము. పూ. ఆ. 5)
మరుఁడు = మన్మథుఁడు, ఈతేంట్లపాటన్ = ఈతుమ్మెదలపాటచే, అన...బొబ్బన్ - అనలాక్షు = శివునియొక్క, పెడబొబ్బన్ = పెద్దదద్దరింపుచే, అలమినతలదిమ్మున్ = మూఁగిన శిరోవేదనను, పాయున్ పో = ఎడఁ.