Jump to content

పుట:Manu Charitra.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తిరస్కరించునొసలను, తీర్చినగంగమట్టితోడన్ - తీర్చిన = తిలకముగా దిద్దిన, గంగమట్టితోడన్ = గంగానదిలోని మృత్తికతోడను, నదీజలమునందు స్నానము చేసి సంధ్య వార్చునపుడు నదీమృత్తిక మొగమున బొట్టు పెట్టుకొనుట ఆచారము. చెక్కుటద్దములందు = అద్దములంబోలు చెక్కులందు, జిగివెల్లువలు = కాంతిప్రవాహములు, ప్రవాహమువలె వ్యాపించు గాంతివిశేషము లనుట. చిందు = తొలఁకునట్టి, రమణీయమణికుండలములతోడన్ - రమణీయ = మనోహరమైన, మణి = రత్నములు చెక్కిన, కుండలములతోడన్ = కర్ణభూషణములతోడను, (మణిభూషలు గాన కాంతివెల్లువలు) పసిఁడి...మిసిమి - పసిఁడివ్రాఁత = బంగారుపనితనముగల, చెఱంగుమిసిమి = అంచుయొక్క మిసమిస, తోఁపన్, చెలంగు = ఒప్పు, అరుణాంశుకోత్తరీయంబుతోడన్ - అరుణ = ఎఱ్ఱని, అంశుక = రంగుగల, ఉత్తరీయంబుతోడ = జందెమువాటుగాఁ బై వేసికొన్న యుపవస్త్రముతోడను, సరిలేని = సాటిలేని, రాకట్టు = రత్నపుఁగట్టడముగల, జాళువామొలకట్టు = మేలిమిబంగరుమొలత్రాడు, బెడఁగారు = అంద మొసఁగు, నీర్కావిపింజెతోడన్ - నీర్కావి = నీట నానఁబెట్టి నీడను ఆరవేయుటచేఁ గొంచె మెఱపురంగు గలదిగా నున్న దోవతియొక్క, పింజెతోడన్ = వ్రేలాడునటుల విడిచిపెట్టిన కుచ్చెళ్లతోడను, ధవళధవళములు = మిగులఁ చెల్లనివి, అగు, జన్నిదములతోడన్ = యజ్ఞోపవీతములతోడను, కాశికాముద్ర = కాశిముద్ర, ఇడిన = వేసిన, ఉంగరముతోడన్ = అంగుళీయకముతోడను, శాంతరసము, ఒల్కు = చెందుచున్న, బ్రహ్మతేజంబుతోడన్ = బ్రాహ్మణతేజముతోడను, ప్రవరుఁడు = ప్రవరరూపము ధరించినవాఁడు, అయ్యెన్ = ఆయెను.

తా. అప్పుడు నొసట గంగమట్టిబొట్టును, చెక్కిళ్లపై వ్యాపించుకాంతులుగల రత్నాలకర్ణాభరణములును, చెఱఁగులం దక్షరపంక్తివలె సరిగతో నేయఁబడిన కమ్ములుగల యుత్తరీయమును, రత్నములు చెక్కిన మొలత్రాడును,