Jump to content

పుట:Manu Charitra.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగముచేఁ గాననివాఁడయి, కోరి = వరూథినిపొందు నపేక్షించి, హత్తక = జతపడక, కడున్ = మిక్కిలి, రారాపులన్ = ఒత్తిడిచే, కంతుఁడు = మన్మథుఁడు, ఉద్వేగంబు = కలవరమును, అందఁగఁజేయన్ = పొందింపఁగా, నెవ్వగలన్ = నిండువిచారముతో, ఉవ్విళ్లూరుచున్, ఏగంధర్వుఁడు, వేఁగువాఁడు = పరితపించుచుండువాఁడో, అంగభవవిద్యాపారగుండు = మన్మథవిద్యయందు గడిదేరినవాఁడు, (అగు) ఆగంధర్వకుమారుఁడు = యౌవనవంతుఁడగు నాగంధర్వకుమారుఁడు, ఆత్మలోన్ = హృదయమునందు, పైపద్యముతో నన్వయము.

విలాస మనునది ఇష్టుఁడగు ప్రియఁని గవయ నభిలషించి భ్రూనేత్రచాలనాదులచే నుత్సాహము వెల్లడించుట. విలాసమునకు లక్షణము.

శ్లో. "ప్రియసంప్రాప్తిసమయే భ్రూనేత్రాననకర్మభిః,
    తాత్కాలికో విశేషో యస్స విలాస ఇతీరితః."

(రసార్ణవసుధాకరము)

తా.మును పొకగంధర్వుఁడు వరూథినిసౌందర్యమును దానిశృంగారచేష్టలను జూచి మోహించి యది యందులకు సమ్మతింపకపోగా దానిని వలపించు నుపాయము గానక నాఁటనుండి మన్మథవేదన పొందుచున్నవాఁడై వరూథిని ప్రవరాఖ్యుని వలచి వాఁడు త న్నొల్లమిచేత మన్మథవ్యథ పడుచున్నవృత్తాంతము విని తన మనసులో నిట్లాలోచించెను.

ఉ.

ఒక్కొకవేళఁ బద్మముఖుఁ లొల్లమి సేయుదు రొక్కవేళఁ బె
న్మక్కువ నాదరింతురు క్షణక్షణముల్ జవరాండ్రచిత్తముల్
బక్కున వేసఱన్ జన దుపాయములన్ దగునచ్చకంబులన్
జిక్కఁగఁ జేసి డాసి సతిచిత్తముఁ బట్టి సుఖింపఁగాఁదగున్.

69

టీ. పద్మముఖులు = తామరపూవులవంటి ముఖము గలవారు — స్త్రీలు, ఒక్కొకవేళన్ = ఒకానొకసమయమునందు, హృదయము రాగాతిశయముచే విజృంభించనియపుడు, ఒల్లమి సేయుదురు = ఇచ్చగింపక పోవుదురు,