| చ. | కొలకొలఁ గూయుఁ బై నొఱగుఁగుత్తుకఁగుత్తుకఁ జుట్టు బాఱు చి | 62 |
టీ. కోకదంపతుల్ = చక్రవాకపక్షుల జతలు, విధిచాతురిన్ = దైవవిలాసముచే, కూడియున్ = మరలఁ గలసియు, పాసినవెతల్ = కడచిన కష్టములను, తలఁపించుచున్ = ఒకదాని నొకటి తలఁచుకొనునట్లు చేసికొనుచు, కొలకొల కూయున్ = కలకలధ్వని నిండార నఱచును. పై నొఱగున్ = ఒకదానిపైకి వేఱొకటి మొగ్గి యానుకొనును. కుత్తుకన్ కుత్తుకన్ = గొంతును గొంతును, చుట్టున్ = అలముకొనును. పాఱుచిల్వలక్రియన్ = పారాడుపాములవలె, కానరాని, గతులన్ = నడకతో, మయిమైన్ = దేహముతో దేహమును, పెనుచున్ = పెనవేసికొనును. జనించు నశ్రువుల్ = జనించుకన్నీళ్లను, అఱుతన్ = ఒండొంటిమెడలచేత, ఒత్తున్ = తుడుచును, సోలును = సొమ్మసిల్లును. నిలుచున్ = ఏమియుఁ జేయక యూరక నిలువఁబడును. రతిన్ = భోగములును, తలఁపపు, కంటె = చూచితివా?
తా. వరూథినీ! చక్రవాకదంపతులు ప్రొద్దు గ్రుంకిన పై గన్ను తెలియక యొండొంటి నెడఁబాసి రేయెల్ల వియోగము ననుభవించి ప్రొద్దు పొడువఁగానే మరలఁ గలసికొని కడచిన కష్టములఁ దలఁపించుకొనుచుఁ గొలకొలఁ గూయఁచుఁ బైపై నొఱగుచు గొంతుగొంతుఁ గలుపుకొనుచుఁ బారాడు పాములవలెఁ బెనఁగొనుచుఁ గన్నీరు కార్చుచు నిట్లు పలుతెఱఁగుల సంకటపడునుగాని సంభోగసౌఖ్యమును దలంపవు చూచితివా?
అలం. స్వభావోక్తి, కారకదీవకము, ఉపమ, విశేషోక్తి.
| ఉ. | ఇందునిభాస్య! వాఁ డనఁగ నింద్రుఁడొ చంద్రుఁడొ యాయుపేంద్రుఁడో | |