నాటకున్ = నాటరాగమునకు, మేళంబు = స్వరస్థానములు సరికూర్పఁబడినది, ఐనవిపంచి = అయినట్టి వీణ, నిన్న మొదలున్, నీవు, అంటమిన్ చేసి = తాఁకకపోవుటచే, ప్రభాతా...తంత్రులన్ - ప్రభాత = ప్రాతఃకాలమందు, ఆయాత = వచ్చిన, వాత = గాలిచే, ఆహత = తాఁకఁబడినవై, ఆలోలత్ = మిగులఁ గదలుచున్న, తంత్రులన్ = తీగలచే, ఆయాలాపంబె = ఆనాటరాగపుస్వరక్రమమునే, (నాటకు మేళము గావింపఁబడియుండుటచే మెట్లపై గాలి సోఁకి యిపుడుగూడ సమయవ్యతిరిక్తముగా నాటరాగమునే,) అవేళన్ = ఆసమయమున, పల్కెడు = పల్కుచున్నది. దేశాక్షికిన్ = దేశాక్షిరాగమునకు, మేళవింపఁగదవే = స్వరస్థానములు కూర్చుమా.
తా. ఓవరూథినీ! నీవు నిన్న మధ్యాహ్నకాలమునం దప్పటికిఁ దగినట్టు నాటరాగమునకు స్వరస్థానములు కుదిర్చి మీటుచున్నవీణ యది మొదలు నీవు దానిని ముట్టకుండుటచేత నిప్పుడును దంతులు గాలిచేఁ గదలఁగా నామేళముతోనే వాఁగుచున్నది. అది యీ యుదయకాలమునకుఁ బొసఁగదు గనుక నిప్పటికిఁ దగిన దేశాక్షిరాగమున కనుకూలముగా స్వరస్థానములు కుదిర్చి జతపఱుపుము. (ఇట్లనుటచేత మధ్యాహ్నకాలమునందుఁ బాడఁదగినది నాటరాగము. ప్రాతఃకాలమునందుఁ బాడఁదగినది దేశాక్షిరాగము అనుట తేఁటపడుచున్నది.)
అలం. స్వభావోక్త్యలంకారము.
| చ. | పలుకులు నేర్పువేళఁ గలభాషిణి నీ విటులుండఁ బంజరం | 58 |
టీ. కలభాషిణి = అవ్యక్తమధురములగు పలుకులు గలదానా! వరూథినీ! పలుకులు = మాటలు, నేర్పువేళన్ = అభ్యసింపఁజేయు సమయము