Jump to content

పుట:Manu Charitra.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నుదయగిరిమీఁదఁ గోపురం బుండి నిగుడు
నహితరవిరశ్మిచే బద్ధుఁ డగుచుఁ దోడి
బలఁగమైనట్టిచుక్కలవలసత్రోవఁ
జూప నేతెంచె నన వేగుఁజుక్క వొడిచె.

54

టీ. సకుటుంబముగన్ = ఆలుబిడ్డలతో, వీఁగి = (సూర్యుఁడను) శత్రునకు భయపడిపాఱి, చరమశైలమున్ = పడమటికొండను, చేరు = చేరుటకుఁ బోవుచున్న (వలసపోవుచున్న) తుహి...దొర - తుహినాంశు = చంద్రునియొక్క, దుముదారుదొర = (రాజునకు వెనుక కాపుదలయై యుండెడు) సేనానాయకుఁడో, అనంగన్ = అనునట్లుగాను, నాసీరమై = సేనాముఖమై — దండునకుముందు నడచునదియై, వచ్చు = వచ్చుచున్న, నలినబాంధవుటెక్కియంబుపైన్ = సూర్యునిధ్వజముమీఁద, దీపించు నద్దము అనఁగన్ = ప్రకాశించు ఆద్దమేమో యనునట్లు, ఆరు...లలోన్ - అరుణాగ్ర = సూర్యునిముందఱ, నిబిడ = ఎడతెగని, వాద్యములలోన్ = భేరి మొదలగు వాద్యములయందు, కనుపెట్టు = కనఁబడుచున్న, సమయ...శంఖము - సమయ = కాల మను, శాంఖికు = శంఖమూఁదువానియొక్క, చేతిశంఖము = చేతిలోని శంఖమేమో, అనంగన్ = అనునట్లు, ఇనుఁడు = సూర్యుఁడు, అప్పుడు = ఆకాలమునందు-ఉదయకాలమునందు, అజుఁ డౌటన్ = బ్రహ్మ యగుటచే, (సూర్యుఁ డుదయమున బ్రహ్మ, మధ్యాహ్నమున రుద్రుఁడు, అస్తమానమున విష్ణువు నగు నని చెప్పఁబడును.) మునుమున్న = ముందుముందుగా, పడివాగెన్ = ఎక్కుటకు సిద్ధపఱుపఁబడినతీరున, కొనివచ్చు = ఎదటికిఁ దీసికొనివచ్చుచున్న, రాయంచకొదమ = చిఱుతప్రాయంపురాజహంస, అనఁగన్, ఉదయగిరిమీఁదన్ = పొడుపుకొండమీఁద, కోపురంబుండి = పగవారిని దెలిసికొనుటకొఱకు పొంచుండి, నిగుడు...రశ్మిచేన్ - నిగుడు = ముందునకుసాగు, అహిత = శత్రుఁడగు, రవి = సూర్యునియొక్క, రశ్మిచేన్ = కిరణము లనుత్రాటిచే, బద్ధుఁ