కేలకున్ = బహుప్రయత్నమున, తెలిసెన్ =(స్మృతి) తెలిసెను. అంతన్ = అప్పుడు, ప్రభాతసమయంబు = తెల్లవారుసమయము, అగుటయున్ = కాఁగా, ఒక్కపువ్వుఁబోఁడి = ఒకపూలవంటి మనోహరాంగకములం గల చెలువ, వరూథినితోన్ = వరూథినిని గూర్చి, ఇట్లనియెన్ = ఇట్లు పలికెను.
చెంగావికిని ఉదయచ్చంద్రచంద్రికకును సామ్యము గలదు, చెంగావి యుదయచ్చంద్రికవలెఁ జల్లనైనది. చంద్రిక వేఁడిగ నుండును. చంద్రికవలె నించుక నెఱ్ఱగా నుండు చెంగావి చల్లగా నుండును. విరహిణికిఁ జెంగావి తాపహారి యనుటకు —
దమయంతికిఁ జెలులు చేయు శిశిరోపచారభాగమునుండి దృష్టాంతము,
సీ. “వలిపెంపుఁజెంగావివలువ గప్పు చకోరి బిసకాండహారంబు పెట్టు హరిణి”
(శృం.నై. ఆ.2)
తా. ఇట్లు పలికి వరూథిని తాపము హెచ్చి మూర్ఛిల్లె, నెచ్చెలులు బహువిధోపచారములఁ జేసి తేర్చిరి. అంతఁ దెల్లవాఱువేళ యయ్యె. అప్పు డొకచెలి వరూథినితో నిట్లనియె.
| ఉ. | పాటన సేయమిన్ గురులు పైఁబడి శీర్ణపటీరపంకలా | 53 |
టీ. ఓ పాటలగంధి = పాటలపుఁబూవులపరిమళముఁ బోలుపరిమళము గలదానా! పాటన సేయమిన్ = చక్కపఱుపకపోవుటచే — దువ్వకపోవుటచేత, కురులు = వెండ్రుకలు, పైఁబడి = పైని గ్రమ్ముకొని, శీర్ణ...లాటిక మై - శీర్ణ = చెదరిన, పటీరపంక = మంచిగందముచే నైన, లాలాటికమై = పాపటబొట్టు కలదై, దర...జంద్రిక - దరస్మిత = చిఱనగవుయొక్క, విలాసపుఁజంద్రిక = వికాస