భోగివి = భోగముల ననుభవించువాఁడవు, పూవిలుకాఁడవు = పూవులు విల్లుగాఁ గలవాఁడవు. ఇట్టినీవు = ఇట్టిమృదులక్షణములు గలవాఁడ వగునీవు, రతిపయ్యెదకున్ = రతీదేవిపైఁటకు, ననుపు = ప్రియము, ఐనచేతులన్ = అగునట్టిచేతులతో, ఎడపక =ఎడతెగక, పడఁతులమీఁదన్ = స్త్రీలపై, ఏయన్ = ప్రయోగించునట్లు, బాణప్రయోగము చేయునంతటి, నిష్ఠురత్వమునకున్ = కాఠిన్యమునకు, ఎట్లు, అలవాటుగన్ = అభ్యాసముగా, చేసితి = కావించితివి, అక్కట = అయ్యో!
మన్మథుఁడు చక్కనివా రందఱికంటెను మిగులఁ జక్కనివాఁడు. రతీదేవి ప్రలాపించుచు నీయభిప్రాయమునె చెప్పెను.
శ్లో. “ఉపమానమభూద్విలాసినాం కరణం యత్తవ కాంతిమత్తయా,
తదిదం గతమీదృశీం దశాం న విదీర్యే కఠినాః ఖలు స్త్రియః.”
(కుమార. చతు.)
తా. మన్మథా! నీవు లోకమునందలి నిండుచక్కఁదనముల నెల్లఁ బ్రోవు చేసి యేర్పఱుపఁబడిన ట్లున్నసౌందర్యము గలవాఁడవు, మిగుల భోగపురుషుఁడవు. మృదుళము లైనపూలు విల్లుగాఁ దాల్చువాఁడవు. ఇట్టి నీవు రతీదేవియొక్క నునుపైఁట నంటఁదగిన యెలచేతులను విరహిణులపై బాణములు ప్రయోగించుపాటి కఱకుఁదనమున కె ట్లలవాటు చేసితివి?
అలం. విషమాలంకారము.
| తే. | అనుచు నిందించి వలవంత యినుమడింప | 49 |
టీ. అనుచున్ = ఇటులని, నిందించి = (మన్మథుని) దూషించి, వలవంత = మదనతాపము, ఇనుమడింపన్ = రెట్టింపఁగా, అవ్వరారోహ = (నెఱిపిఱుఁదులు గల) ఆస్త్రీ, విద...దుమారమ్ము - విదళిత = విరియఁ