Jump to content

పుట:Manu Charitra.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బంగారు ఒకనికి మోహము గలిగించును గాని తా నొకడిని మోహింపదు మనకుల మట్టిది. అట్టికులమునఁ బొడమియుఁ గరువేఁదుఱుచే నిటుల మెలఁగు నిన్నుఁ జూచిన వేల్పుచెలులు నవ్వకపోరు. ఈ మనోహరాకారము నెడఁ గనికరము లేమి తగ దనియు "శరీరమాద్యం ఖలు ధర్మసాధన" మన్నటులఁ గామధర్మసాధనభూత మగు దేహమునెడఁ గనికరింప నగు నని చెలులు వరూథినికిఁ దెలిపిరి.

తా. నీరూఁదిన బంగారమువలె పైపై వలపులు చూపవలసిన భోగముకులముమర్యాద లేక యిట్లు నిక్కపుమోహము నిల్పి తాపపడుట తగదు. నీకులమువెలఁదు లెవ్వరును నీనడవడికి మెచ్చుకొనరు. కాపాడుకొనక యీ చక్కఁదనాల శరీరమును వెన్నెలలో వేఁచుట తగదు. ఆఁడువాండ్ర కింత చూపుపిచ్చి కూడదు.

చ.

ఉడుపతిబారికిన్ వెఱచి యూఱట యౌ నని పేరుటామనిన్
ముడిపడుకంతుసేనలకు ముయ్యెలగు ట్టయినట్టి యిందు రా
నడఁగునె తాపవహ్ని మనమై హరిణేక్షణ ముల్లు పుచ్చికొ
ఱ్ఱడఁచినచందమయ్యెఁ బదమా యెలదోఁటఁ జరింప కింటికిన్!

34

టీ. హరిణేక్షణ = జింకచూపులు గలవరూథినీ! ఉడుపతిబారికిన్ = చంద్రునివలని హింసకు, వెఱచి, ఊరట యౌన్ = కొంతశాంతి యగును, అని = అనుకొని, పేరుటామనిన్ = నిండారినవసంతకాలమున, ముడివడుకంతుసేనలకున్ = గుమిగూడు మరునిదండునకు, ముయ్యెలగుట్ట = కూడలిపట్టు, అయినట్టి = అయి యొప్పుచున్నటువంటి, ఇందున్ = ఈతోఁటకు, (మన్మథుని పరివారమున కునికిపట్టగు నీయుద్యానవనము మీఁదు మిక్కిలి తాపకరము గాని వేఱుగాదు గాన) రాన్ = వచ్చినయెడ, తాపవహ్ని = విరహతాపాగ్ని, అడఁగునె = శాంతించునా, మనమై = మరయంతమనము, ముల్లుపుచ్చి = ముల్లు తీసివైచి, కొఱ్ఱు = ఇనుపమేకును, అడఁచినచందము = దిగగ్రుచ్చినవిధము,