| క. | అట్టియెడ నమ్మృగేక్షణఁ | 32 |
టీ. అట్టియెడన్ = ఆ సమయమున, అమ్మృగేక్షణ = జింకచూపులవంటి చూపులు గల యావరూథినిని, సఖీజనము = చెలికత్తెలసమూహము, పట్టి = చుట్టుముట్టి, వెడఁగుఁబట్టీ = పిచ్చిబిడ్డా! ఇట్టితెగువ = ఇట్టిసాహసము, తగవే = తగునా, అనుచున్, చెక్కులన్ = చెక్కిళ్లియందు, తొట్టినకన్నీరు = కాఱినకన్నీటిని, పోవన్ = పోవునట్లు, తుడుచుచున్ = వస్త్రముతో నొత్తుచు, పలికెన్ = వాకొనెను.
| ఉ. | పూఁతపసిండివంటివలపున్ బచరించుకులంబునీతికిన్ | 33 |
టీ. లేమ = చిన్నదానా! పూఁతపసిండివంటివలపున్ = నీరూఁదినబంగారువలెఁ బైపైఁ దోవఁ జేయుమోహమును, హృదయమునందు లేకున్నను బయటి కున్నటుల వర్తించుట సహజము. అట్టికృత్రిమ మగువలపును, పచ...నీతికిన్ - పచరించు = నటించు, కులంబు = వంగడముయొక్క, నీతికిన్ = న్యాయమునకు, వేశ్యజాతి మర్యాదకు, ఇత్తెఱఁగు = ఈవిధము, ఈవిధముగా నిక్కువమగు వలపునఁ బడి పరితాపము నొంది విరహాగ్నిమగ్న మగుట, లేఁత = చుల్కన, కదమ్మ, సురాంగనలెల్లన్ = దేవతాస్త్రీ లందఱును, ఇట్టి నీచేఁతకున్ = ఇటువంటి నీవ్యాపారమునకు, మెత్తురమ్మ = మెచ్చుదురఁటమ్మా? దయసేయక = ప్రేమింపక, తిన్ననిమేను = చక్కనిశరీరము, వెన్నెలన్, వేతురఁటమ్మ = తపింపఁజేయుదురా! ఇంతికిన్ = స్త్రీకి, ఇంతకనువేఁదుఱు = ఇంతచూపుపిచ్చి, చెల్లునఁటమ్మ.