టకై నెత్తుటికూడును దూర్పుదిక్కున బలివైచి దానికిఁ జెట్టునో పుట్టనో గుఱుతుంచుకొని త్రవ్వి యెత్తుదురు. ఆవిధముననే ప్రకృతము కాలపురుషుఁడు చీకటి యనుకాటుకను బెట్టుకొని చూచి చంద్రునియుదయమునఁ దూర్పునఁ దోతెంచురక్తిమ యనురక్తము కలిపి నక్షత్రము లనునన్నమును దూర్పుదిక్కున భూతబలిగాఁ జల్లి మఱ్ఱిగుఱుతుగల (చంద్రునిలోనికళంకమును మఱ్ఱినిగా వర్ణించుట కలదు.) చంద్రుఁ డనునిధిని మన్మథున కిచ్చుటకై త్రవ్వి యెత్తెను.
అలం. రూపకాలంకారము.
| మ. | జలజాగారపరంపరల్ మఘరదాశాభిత్తిఁ దీండ్రించుచున్ | 22 |
టీ. జలజాగారపరంపరల్ - జలజ = పద్మములను, అగార = ఇండ్లయొక్క, పరంపరల్ = వరుసలు, మఘవత్ ఆశాభిత్తిన్ = తూర్పుది క్కనెడుగోడనుండి, తీండ్రించుచున్ = ప్రజ్వలించుచు, వెన్నలచిచ్చులు = వెన్నెల యనునిప్పులు, దళమై = మెండై, అంటినన్ = తాఁకఁగా, మిళ...చ్ఛలనన్ - మిళత్ = కలసికొను, బాహ్యచ్ఛద = పైఱేకులయొక్క, శ్యామికా = నలుపను, ఛలనన్ = మిషచే, కంది = కమలి, ముడుంగుచోన్ = ముడుఁగుకొనునప్పుడు, సిమసిమచ్ఛబ్దంబుతోన్ = సిమసిమ యనుధ్వనితో, పుట్టు...బొగలో - పుట్టు, అగ్గలపు = అధికమగు, క్రొంబొగలో = క్రొత్తపొగలో, అనంగన్ = అనఁగా, గర్భస్వనద్భృంగముల్ = లోపలిభాగమునుండి ధ్వనిచేయుతుమ్మెదలు, వెడలెన్ = బయలుదేఱెను.
రాత్రులందుఁ దమ్ములు ముకుళించును. అందుచే ముకుళములందు నిర్బంధము గలుగునేమో యని తుమ్మెదలు ముందుగనె వెడలుట సహజము. తుమ్మెదలు నల్లగా నుండును గాన పొగ వెడలినటుల బయట వచ్చుచున్న వని