డని విని మోమున వ్రాలియున్న చీకట్లను వెండ్రుకలను జక్కఁజేసికొనుట కెత్తికొన్న దంతపుదువ్వెనయో యనునట్లు తూర్పునఁ దెలుపు చూపట్టెను.
అలం. ఉత్ప్రేక్ష, రూపకము.
| చ. | మరున కొసఁగఁ గాలము తమశ్ఛట గాటుక గా నవోదయ | 21 |
టీ. అత్తఱిన్ = ఆసమయమున, కాలము = కాల మను పురుషుఁడు, మరునకన్ = మన్మథునకు, ఒసంగన్ = ఇచ్చుటకు, తమఃఛట = చీకటిరాశి, కాటుక = (నిధులను గుర్తించుట సాధన మగు) అంజనము, కాన్ = కాగా, నవో...భక్తమున్ - నవోదయ = క్రొత్తగా నుదయించుకాలమునందుఁ బొడమి, స్ఫురత్ = ప్రకాశించు, అరుణప్రభా = ఎఱ్ఱనికాంతియను, పథిక = వియోగులయొక్క, శోణిత = రక్తముచే, సిక్త = తడుపఁబడిన, సిత = తెల్లని, ఉడు = నక్షత్రము లనెడు, భక్తమున్ = అన్నమును. (నెత్తురుచేఁ దడుపఁబడిన యెఱ్ఱనియన్నమును) హరి...స్థలమునన్ - హరిహయదిక్ = తూరుపుదెసయందలి, నభస్స్థలమునన్ = ఆకాశమున, బలి = భూతబలిని, చల్లి, పటాంకమున్ = మఱ్ఱిచెట్టుగుర్తు గలదియఁ, వసూత్కరభరితంబును = కిరణసమూహ మను ధనసమూహముతో నిండినదియు, ఐ, వెలుఁగన్ = ప్రకాశింపఁగా, కాంచి, సుధానిధిన్ = అమృతమునకు నిధి యగు చంద్రుని — చంద్రుఁడనెడునిధిని, ఎత్తెన్ = పైకిఁ దీసెను. చంద్రునిలోని కళంకమును మఱ్ఱిగా వర్ణించుటయుఁ గలదు. సీ. "అమృతాంశుమండలం బాలవాలము గాఁగ మొలచె నొక్కటి జగన్మోహనముగ, మఱ్ఱిమాత్రంబ.” జైమినీభారతము. ఆశ్వా. 1.
తా. లోకమున నిధుల నెత్తువారు నిధిసాధకమగుకాటుకను కన్నులకుఁ బెట్టుకొని చూచి యానిధులఁ గాచియుండిన పిశాచాదులవలని బాధ తొలఁగు