దృశ్య = తోఁచునట్టి, కమలజాండ = బ్రహ్మాండ మను, కటాహ = గంగాళముయొక్క, కనకఘృణియొ = బంగారుకాంతియో, చండీశ...చయమొ - చండీశ = శివునియొక్క, తాండవోత్సవ = నాట్యోత్సవమందు, సంభృత = పట్టుకోఁబడిన, క్షపా = రాత్రియను స్త్రీయొక్క, హస్తాగ్ర = చేతికొన నున్న, దీప = దివటీయొక్క, గభస్తి = కాంతులయొక్క, చయమొ = సమూహమో, ద్రాక్...రాశియో - ద్రాక్ = త్వరగా, విదాహ = అతిదాహమును, ఛిదా = పోఁగొట్టుటయందు, వినిద్రాణ = మెలఁకువతో నున్న, మదవత్ = మదము గల, అంజన = అంజన మనెడు పడమటిదెసయేన్గుయొక్క, ఆలాన = కట్టుగొయ్యయొక్క, మూల = మొదట, శయ్యావిధాన = పడక నేర్పఱుచుకొఱకు, వారుణ = వరుణునిసంబంధి యగు, ఆధోరణ = మావటివానిచే, ఆకల్పిత = కల్పింపఁబడిన, ఉరు = పెద్ద, శోణమృత్తికా = ఎఱ్ఱమట్టియొక్క, రాళియో = ప్రోవో, అనన్ = అనునటుల, మెఱసెన్ = ప్రకాశించెను.
(మదమెక్కువయైన యేనుంగులకు దప్పిక యతిశయించును. ఆదప్పిక యెఱ్ఱమట్టిపైఁ బరున్నచో మానును గాన నట్టియేనుంగుల శయనస్థలమున నెఱ్ఱమన్ను వోయవలె నని గజశాస్త్రమునందుఁ గలదు.)
తా. సూర్యుఁడు పడునెడఁ బాయ విచ్చిన పడమటిసముద్రమునుండి మీఁదికి కానిపించిన శేషునిపడగలమీఁది రత్నముల కాంతియో? (శేషుఁడు వేయిపడగలు గలవాఁడు గావునను సూర్యుఁడు సహస్రకిరణుఁడు గావునను కిరణకాంతులు రత్నకాంతులో యన నుండె ననుట యత్యంతసముచితము.) అస్తాద్రిశిఖరములందు సూర్యుఁ డస్తమింపఁగానే ప్రజ్వలించు మెఱుఁగుడుఁదీగెలవెల్తురో? సూర్యునిరథపునొగ తాకి దిక్ప్రదేశము బ్రద్దలయి లోనికి ప్రసరించిన బ్రహ్మాండ మను బంగారుగంగాళముయొక్క కాంతియో? శివుఁడు తాండవమాడుతఱి రాత్రి యనుస్త్రీ తాల్చిన దివ్వటీవెలుఁగో? పశ్చిమదిగ్గజమునకు మద మెక్కి విదాహము కలుగఁగా దానిని దగ్గించుటకై వరుణునిసంబంధి యగుమావటివాఁ డాదిగ్గజపుఁగట్టుఁగంబముదగ్గఱఁ బఱచిన