Jump to content

పుట:Manu Charitra.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

నుఱికి యెఱకలు దడియ వే ఱొక్కతమ్మి
కరుగు నరిగి రవంబుతోఁ దిరుగు తేంట్లఁ
బొడుచు ముక్కున మఱియును బోవు వెదక
సంజఁ బ్రియుఁ బాసి వగ నొక్కచక్రవాకి.

16

టీ. ఒక్కచక్రవాకి = ఒకయాఁడుజక్కవ, సంజన్ = సంధ్యాకాలమున, ప్రియున్ = మగజక్కవను, పాసి = ఎడబాసి, వగన్ =విచారముతో, సైకతంబులన్ = ఇసుకతిన్నెలపై, ఏవిహంగమున్ = ఏపక్షిని, కన్నన్ = చూచినను, ఎలుఁగు ఇచ్చుచును = కూఁతనొసఁగుచు (అది తన్ను గుఱుతించుటకు), సారెకును = మాటికిని, కూడన్ = (దానిని) కలయుటకు, తారున్ = వెన్నాడును. తా నెవతెయో కంఠస్వరంబుతోఁ దెలుపుకొనుచుఁ బ్రియుఁడేమో యని యితరపక్షిని సమీపించును. తారి = అట్లు వెన్నాడి, కన్గొని = చూచి, అది, తనజోడు = తనజంటది, కాకున్నన్ = కాకపోగా, మెడయెత్తి = (తనజంటపులుఁ గెటు పోవుచున్నదో యెచట వాలునో యని చూచుటకు) మెడ సాచి, కలయంగన్ = అంతటను, మింటన్ = ఆకసమున, అరయున్ = చూచును. అరసి = చూచి, కన్నీటితోన్ = కన్నుల నీరు రాఁగా, (ప్రియుఁడు కనిపింపఁడాయెనే యని కన్నీరు గార్చుచు), మరలి = వెనుకకుఁ దిరిగి, తామర = తామరపూవును, ఎక్కి, వదనము = ముఖము, ఎండఁగన్ = ఎండిపోవుచుండఁగా, (ఆఱచి యఱచి నోటి తడి యాఱిపోవఁగా) సరః+వారిన్ = సరస్సునందలి నీటిని, అద్దున్ = ఆనును, అద్ది = ఆని, త్రావఁగన్ = త్రాగుటకు, సైఁపక = చవికాక, అట్టిట్ట = అటునిటు, కన్గొని = చూచి, ప్రతిబింబము = (నీటిలోఁదోఁచు) తనమాఱురూపును, ఈక్షించి = కాంచి, బ్రమసి = భ్రమించి, (తనప్రియుఁడో యని), ఉఱుకున్ = దుముకును. ఉఱికి, ఎఱుకలు = ఱెక్కలు, తడియన్, వేఱొక్కతమ్మికిన్ = మఱొకపద్మమునకు, అరుగున్ = పోవును, అరిగి, రవంబుతోన్ = ధ్వనితో, తిరుగు తేంట్లన్ = తిరిగెడు తుమ్మెదలను, ముక్కునన్ = ముక్కుతో, (తాను జింకతో నున్నపు డుల్లానముగాఁ జెలరేగి కూయుచున్నవే యని)