రథముగలవాఁడువలె, (సంజవేళ సూర్యునిగమన మతివేగము గల్గినట్లు కన్పడుట ప్రసిద్ధము.) క్రుంకెన్ = అస్తమించెను.
సూర్యునియశ్వములను ఏ డని కొందఱు ఒకటి యని కొందఱు చెప్పుదురు. సప్తాశ్వనామముచే నే డనుట ప్రసిద్ధము. (ఒకటి యనుపక్షమును పెద్దన స్వీకరించునటులఁ దోఁచును. సముద్రమునం దాఁడుగుఱ్ఱము గలదనియు దానికడుపున బడబాగ్ని యుండి యది వాననీరు గ్రోలు నని పురాణకథ.) కొందఱు సూర్యునిరథాశ్వము సప్త+అను నశ్వము కాననే సప్తాశ్వుఁ డయ్యెనందురు. సూర్యునియం దేడురంగులు గలవు. వానిచే సప్తాశ్వముగాఁ జెప్పి రని ప్రకృతిజ్ఞు లందురు. గురుబాలప్రబోధికలో “సప్త అశ్వాః యస్య నః సప్తాశ్వః” అనియు; “సప్తనామకః అశ్వః యస్యేతి వా సప్తాశ్వః” అనియు నుభయపక్షముల కనుకూలము లగు వ్యుత్పత్తులు గలవు.
తా. సూర్యరథము పడమటిసముద్రముఁ జేరఁబోవునపు డందు బడబాగ్నిని వహించి యుండెడు నాఁడుగుఱ్ఱపుమోర కన్పడఁగానే దానిని కలయుతమకముతో నతివేగమున సూర్యాశ్వములు రథము నీడ్చుకొనిపోయెనో యనున ట్లంతలో సూర్యుఁ డస్తమించెను.
అలం. ఉత్ప్రేక్షాలంకారము.
| వ. | ఆసమయంబున. | 15 |
| సీ. | ఏవిహంగముఁ గన్న నెలుఁ గిచ్చుచును సారె | |