టీ. తరణి = సూర్యుఁడు, ఇదె = ఇదిగో, క్రుంకుచున్నాఁడు = అస్తమించుచున్నాడు. అరుదెమ్ము = ఏతెమ్ము, నీవు త్వరగా రమ్ము, అని, చంద్రున్ = చందమామను, పిల్వన్ = పిల్చుటకు, అరిగెడు...దూతికలు - అరిగెడు = వెళ్లునట్టి, రజనీతరుణీమణి = రాత్రియను స్త్రీయొక్క, దూతికలు = తార్పుకత్తెలు, అనన్ = అనునటులు, నీడలు = (వస్తువుల)ఛాయలు, అతిదీర్ఘములై = మిగుల నిడుపులై, తూర్పునకున్ = తూర్పుదిక్కునుగూర్చి, అరిగెన్ = పోయెను.
అలం. ఉత్ప్రేక్షాలంకారము.
రాత్రి యనుచెలువకుఁ జంద్రుఁడు ప్రియుడు. ప్రతాపశాలియగు తరణి యఁన్నంతవఱకుఁ గలయిక పొసఁగదు. తూర్పునకుఁ బొడవు సాగిన నీడ లుదయింపఁబోవు చంద్రుని బిలుచుదూతిక లని భావము.
తా. ప్రతావవంతుఁ డయిన సూర్యుఁ డనువైరికి వెఱచి చంద్రుఁడు డాఁగియుండఁగా నాతఁ డస్తమించుచున్నాఁ డింక నీవు రమ్మని పిల్చుకొని వచ్చుటకై పోవు రాత్రి యనుస్త్రీయొక్క దూతికలో యనునట్లు వృక్షాదులనీడలు దూర్పునకుఁ బొడవుగాఁ బోవుచుండెను.
| క. | క్రుంకె నపరాంబురాశిం | 14 |
టీ. పంకజబుధుఁడు = సూర్యుఁడు, అపరాంబురాశిన్ = పడమటిసముద్రమున, తదీయ...తాంగుఁడువోలెన్ - తదీయ = ఆపడమటిసంద్రపుసంబంధ మగు, ఆపడమటిసముద్రమునం దుండెడు, బడబా = ఆఁడుగుఱ్ఱముయొక్క, ముఖ = ముఖముయొక్క, వీక్షా = చూచుటచే, అంకురిత = అంకురించిన, కుతుక = కుతూహలముగల, రథ్య = రథాశ్వములయొక్క, నిరంకుశ = అడ్డులేని, వేగ = వేగముచే, అపహృత = ఈడ్చుకొని పోఁబడిన, శతాంగుఁడువోలెన్ =