Jump to content

పుట:Manu Charitra.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆశ్రమాంతర = మునిపల్లెలలో నున్న, భూరుహాగ్రముల్ = వృక్షాగ్రములను, మునికోటి = మునిసమూహము, బద్ధకాషాయవిభ్రాంతిన్ = ఆరఁగట్టిన కావివస్త్రములను భ్రమతో, చూడన్, (మునిపల్లెలలో నున్నవృక్షములకొనలను జూచి మునులు తమకావివస్త్రముల నెండఁగట్టినట్టు భ్రాంతి చెందఁగా ననుట), ఘన...శృంగాటకంబులన్ - ఘన = గొప్పవైన, సాను = చఱియలను, శృంగ = శిఖరములను, శృంగాటకంబులన్ = నాల్గుత్రోవలు కలియుచోట్లను, కాంచి, అమరులు = దేవతలు, హేమాద్రి యనుచున్ = మేరుపర్వత మని, వ్రాలన్ (విమానము లెక్కి యాకసమునఁ దిరుగుదేవత లెఱ్ఱనిచఱియలను శిఖరములను జదుకములను గాంచి మేరుపర్వతమే యనుకొని దిగి రాఁగా ననుట), హిమవంతము సాంధ్యరాగముచే నెఱ్ఱపడెను. సువర్ణము రక్తగణములోనిది గాన నెఱ్ఱగా నున్న మంచుకొండను వేల్పులు మేరుగిరిగా భ్రమించిరి. అన్నగంబునన్ = ఆ కొండపై, కింశుక...బాంధవంబులు - కింశుక = మోదుగుపూవులయొక్కయు, ప్రవాళ = పవడములయొక్కయు, ఘుసృణ = కుంకుమపూవుయొక్కయు, కిసలయ = చిగురుటాకులయొక్కయు, కంకేళికుసుమగుచ్ఛ = రక్తాశోకపుఁబూగుత్తులయొక్కయు, బంధుజీవ = మంకెనపూలయొక్కయు, జపా = జపాకుసుమములయొక్కయు, రాగ = ఎఱుపునకు, బాంధవంబులు = చుట్టాలు (అగు) జరఠారుణాతపములు = ముదిరినయెఱ్ఱయెండలు (సంజయెండలు), పేశలరుచిన్ = మృదుకాంతితో, కాసెన్.

అలం. భ్రాంతిమంతము నుపమయు.

సాయంసమయమునందు ఎండ ఎఱ్ఱగానుండి సమస్తవస్తువులను రక్తవర్ణముతో నలరారఁజేయుచు నలుగడల వ్యాపించి వేఁడిలేక యొప్పె నని భావము.

శా.

శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు లుష్ణాంశుపా
షాణవ్రాతము కోష్ణ మయ్యె మృగతృష్ణావార్ధు లింకెన్ జపా