త్రోసి చనియె నని కోపము దాల్చి యెఱ్ఱవాఱెనో యనునట్లు సూర్యు డెఱ్ఱనికాంతి గలవాఁ డయ్యెను.
అలం. పరికరము, ఉత్ప్రేక్ష, కావ్యలింగము.
| సీ. | ఉరుదరీకుహరసుప్తోత్థశార్దూలముల్ | |
| తే. | గాసెఁ బేశలరుచిఁ గింశుకప్రవాళ | 11 |
టీ. ఉరు...శార్దూలముల్ - ఉరు = గొప్పవగు, దరీకుహర = గుహలకలుగులలో, సుప్తోత్థ = నిద్రించి లేచిన, శార్దూలముల్ = పెద్దపులులు, ఝరవారి = సెలయేళ్లలోని నీటిని, శోణితశంకన్ = రక్త మనునూహతో, త్రావన్ = త్రాఁగగా, (గుహలలో నిద్రించుచుండి అప్పుడే లేచి వచ్చిన పెద్దపులులు సెలయేళ్లలోనినీటిని రక్త మని త్రాగఁగా ననుట), వన...మృగపంక్తి - వన = అడవియందలి, కుంజ = పొదరిండ్లయొక్క, మధ్య = నడిమి, శాద్వల = పచ్చికపట్టులందు, చరత్ = చరించు, మృగపంక్తి = జింకలగుంపు, దావపావకభీతిన్ = దావాగ్ని యనెడు భయముచే, తల్లడిల్లన్ (పొదరిండ్ల నడిమి పచ్చిక నేలలందు మేత మేయుజింకలు పొదరిం డ్లెఱ్ఱగాఁ గాన్పించుటచేఁ గాఱుచిచ్చని జడియఁగా ననుట), ఆశ్రమాం...గ్రముల్