ప్రియుఁడు మిక్కిలి స్వాధీనుఁడై సంభోగకాంక్షలఁ దీర్చుచు ఱొమ్మునఁ జేర్చుకొనుచుండ సౌఖ్య మందుటకు నోఁచుకొననియాఁడుదానిచక్కఁదనము యౌవనము ప్రాణము నిష్ప్రయోజనములు.
అలం. అప్రస్తుతప్రశంసాలంకారము.
| ఉ. | ఎంతతపంబు సేసి జనియించినవారొకొ మర్త్యభామినుల్ | 8 |
టీ. మర్త్యభామినుల్ = మనుష్యస్త్రీలు, ఎంతతపంబు చేసి = ఎంతపెద్దతపస్సును గావించి, జనియించినవారొకొ = పుట్టిరో? కాంతుఁడు = ప్రియుడు, అవజ్ఞ = అవమానము, చేసినన్ = చేసిన పక్షమున, కాయము = శరీరమును, పాయుదురు = వీడుదురు, ఏన్ = నేను, అమర్త్యనై= (చావులేని) దేవతాస్త్రీనై, చింతలవంతలన్ = దుఃఖములతోను అవస్థలతోను, చివికి = చీకుచెంది, సిగ్గఱితిన్ = సిగ్గుమాలితిని,మృతి లేనినాదుచెల్వు ఇంతయున్ = చావు లేని నాచక్కఁదనమంతయు, శూన్యగేహమునకున్ = పాడుకొంపకు, ఎత్తినదీపిక = పెట్టినదీపము, అయ్యెన్ = ఆయెను. అక్కటా = అయ్యో!
"మ్రియత ఇతి మర్త్యః” అను వ్యుత్పత్తిచేత మనుష్యజన్మము చావు గల దని, తద్వ్యతిరేక మగుటచే నమర్త్యులు చావు లేనివా రని భావము.
తా. మనుష్యస్త్రీ లెంతయేని పుణ్యము చేసినవారు. ప్రియులు వారియెడ నవజ్ఞను జూపునపుడు దేహము వీడి దుఃఖముఁ దీర్చుకొందురు. దేవతాస్త్రీ నగుటచేఁ జింతలను వంతలను చీకుచెంది సిగ్గుమాలవలసినదే కాని చావఁదరము గాదు గదా! చావులేని నా యీచక్కఁదన మంతయుఁ బాడుకొంపకుఁ బెట్టినదీపమువలె నయినది.
అలం. ఉత్ప్రేక్ష, పరికరాంకురము, నిదర్శన.
| వ. | అని వితర్కించుచుం గ్రించుఁదనంబునన్ బునఃపునఃపరిభవ | |