ములై యున్నవి. వహ్వా! వానికన్నులు విశాలములై కమలములను లెక్కగొనక యున్నవి.
అలం. ఉత్ప్రేక్ష, ఉపమ, రూపకము, ఆతిశయోక్తి.
| ఉ. | చొక్కపుఁబ్రాయమున్ మిగులు సోయగమున్ గల ప్రాణనాయకుం | 7 |
టీ. చొక్కపుఁబ్రాయము = తేఱినయౌవనమును, మిగులన్, సోయగమున్ = చక్కఁదనమును, కలప్రాణనాయకుఁడు = కలిగినప్రియవల్లభుఁడు, ఎక్కుడు వశ్యతన్ = ఎక్కువయధీనతతో, రతులన్ = సంభోగములయందలి, ఏఁకటన్ = అత్యపేక్షను, తీర్చి = సవరించి, సమేళము = ఐక్యము, (ఒకటిగాఁ గలిసి యుండుట) ఒప్పఁగాన్ = చెలఁగునట్లు, అక్కునన్ = ఱొమ్మున, గారవించి = గారవింపఁగా, ప్రియము = ప్రేమమును, అందఁగన్ = చెందుటకు, నోఁచనియింతిది = నోఁచుకొనని దురదృష్టవంతురాలగు స్త్రీది, ఐనయాచక్కఁదనంబు అది = అట్టిసౌందర్యము, ఏమిటికిన్ = ఎందులకు? జవ్వనము = యౌవనము, ఏటికిన్ = ఎందులకు? ప్రాణము = ఉసురు, ఏటికిన్ = ఎందులకు? ఇన్నియు వ్యర్థ మని భావము.
రతులఁ దృప్తిదీర్చుట, సమేళ మొప్ప నక్కున గారవించుట అనువానిచేఁ బురుషాయితభోగ మూహ్యము. ఇదియే రతికిఁ బరమావధి. అట్టిభాగ్యమునకు నోఁచనైతి ననుట. అక్కున గారవింపఁబడుటయే పురుషాయితధర్మ మనుటకు
శ్లో. “ఉరసి నిపతితానాం స్రస్తధమ్మిల్లకానాం
ముకుళితనయనానాం కించిదున్మీలితానాం
ఉపరిసురతఖేదస్విన్నగండస్థలానా
మధరమధు వధూనాం నాభాగ్యవంతః పిబంతి.”
భర్తృహరి. శృం. శ.
తా. తేఱినయౌవనమును నిండారు చక్కఁదనమును గల్గుమనః