Jump to content

పుట:Manu Charitra.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెఁ ట్లీఁదఁగలను? తక్కువనోములు నోఁచినట్టి యీ నే నెక్కడ? వానికౌఁగి లెక్కడ? హా దైవమా! యేమి చేయఁదును?

అలం. పరిణామము. విషమము.

ఉ.

కమ్మనికుందనంబు కసుగందనిమే నెలదేఁటిదాఁటులన్
బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెఁడు వెండ్రుక లిందుబింబమున్
గిమ్మననీదు మోము గిరిక్రేపులు మూఁపులు కౌను గానరా
దమ్మకచెల్ల! వానివికచాంబకముల్ శతపత్త్రజైత్రముల్.

6

టీ. అమ్మకచెల్ల = ఔరా! వాని = ఆప్రవరుని, కసుగందనిమేను = ఇంచుకంతయినవాడు దేఱని (వాని) శరీరము, కమ్మనికుందనంబు = పరిమళించు మేలిమిబంగారము, తెగబారెఁడువెండ్రుకలు = బారకొలఁదినిమించిన (వాని) తలవెండ్రుకలు, ఎలదేఁటిదాఁటులన్ = కొదమతుమ్మెదబారులను, బమ్మెరవోవన్ = అదరిపోవునట్లు, తోలున్ = పాఱదోలును, మోము = ఆతనిముఖము, ఇందుబింబమున్ = చంద్రబింబమును, కిమ్మననీదు = ఏమి యని వాయెత్తి మాటలాడనీయదు. తిరస్కరించును. మూఁపులు = భుజశిరస్సులు, గిరిక్రేపులు = పర్వతశిఖరములు, మిగుల నున్నతముగా నున్న పనిభావము. కౌను = నడుము, కానరాదు = అగపడదు. వాని వికచఅంబకముల్ = విరఁబాఱియుండు వానికన్నులు, శతపత్త్రచైత్రముల్ = పద్మములను జయించునివి.

శైలశిఖరములవలె భుజము లున్నతములుగా నుంట సౌందర్యాతిశయము. విజయవిలాసంబునం దిటులె "ఎగుభుజంబులవాఁడు" అనియు, ఇందే ద్వితీయాశ్వాసమున “నిక్కి వీనులతోడ నెక్కసక్కెము లాడుకరణి నున్నవి వీనిఘనభుజములు" అనియుఁ జెప్పఁబడెను.

తా. ఆహా! ఏమని వర్ణింతును? ఇంతైన వాడుదేఱని వానిశరీరము పరిమళము కల మేలిమిబంగారము. బారతో బారెఁడు నిడుపుగల వానివెండ్రుకలు తుమ్మెదలబారును మీఱునెఱులు గలిగి యున్నవి. ముఖమా చంద్రబింబమును మించి యున్నది. భుజశిరస్సులు పర్వతాగ్రములవలె నున్నత