మకరందమును, అందంద = ఎడనెడ, పొంగంజేయుచున్ = పైకుబుకఁజేయుచు, (పెంచుచు) పావకప్రసాదలబ్ధంబు = అగ్నిదేవునిదయవలనఁ బొందఁబడినది అగు, పవనజవంబునన్ = వాయువేగముతో, నిజమందిరంబునకున్ = తనగృహమునకు, అరిగి = పోయి, నిత్య...పంబులు - నిత్యకృత్య = అనుదినముఁ జేయఁదగిన, సత్కర్మ = పుణ్యకర్మములయొక్క, కలాపంబులు = సమూహములు, నిర్వర్తించెను = నెఱవేర్చెను. అని = యిటులని, మార్కండేయుండు = మార్కండేయమహాముని, క్రోష్టికి = క్రోష్టియనుమునితో, చెప్పెన్, అని, చెప్పినన్ = పక్షులు జైమినిమునితోఁ జెప్పఁగా - దీనికిఁ బైపద్యముతో నన్వయము.
తా. ప్రవరుఁ డిటుల నగ్నిని స్తుతింప నగ్నిదేవుఁడు ప్రవరునిదేహమునం దావేశించి యమితతేజోబలములఁ గలిగించెను. అంతఁ బ్రవరుఁడు వరూథినిని దొలంగి దానియనురాగము నభివృద్ధిఁజేయుచు వాయువేగముతో గృహము చేరి నిత్యకర్మములు సక్రమముగా నిర్వర్తించుకొనెను.
అలం. ఉత్ప్రేక్షారూపకాలంకారములు.
| క. | జైమిని యాదివ్యఖగ | 78 |
టీ. జైమిని = జైమినియనుమహాముని, ఆదివ్యఖగగ్రామణులన్ = దేవసంబంధములయిన యాపక్షిశ్రేష్ఠములను, వేడ్క = వేడుక. (కథలు వినుటయం దాసక్తి) కడలుకొనంగాన్ = ఎక్కువ కాఁగా, ఆమీఁదన్ = అటమీఁదట, వరూథినివిధము = వరూథినీప్రకారము, ఏమయ్యెన్ = ఏమిగా జరిగెను. నాకున్, ఎఱుంగన్ = విశదమగునట్లు, చెప్పరే = మీరు చెప్పుఁడు, అనుడున్ = అని యడుగఁగా, దీనికి బైయాశ్వాసమునందలి యవధరింపు మనుక్రియతో నన్వయము.