Jump to content

పుట:Manu Charitra.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని సంస్తుతించిన నగ్నిదేవుం డమ్మహీదేవుదేహంబున సన్ని
హితుం డగుటయు నమ్మహాభాగుండు గండుమీఱి పొడు
పుఁగొండ నఖండసంధ్యారాగప్రభామండలాంతర్గతుం డగు
పుండరీకవనబంధుండునుంబోలె నుత్తప్తకనకద్రవధారాగౌ
రం బగుతమచ్చాయాపూరంబున నక్కాన వెలింగించుచు
నిజగమనవిరోధిని యగునవ్వరూధినిహృదయకంజంబున రం
జిల్లునమందానురాగరసమకరందంబు నందంద పొంగంజేయు
చుఁ బావకప్రసాదలబ్ధం బగుపవనజవంబున నిజమందిరం
బున కరిగి నిత్యకృత్యసత్కర్మకలాపంబులు నిర్వర్తించె నని
మార్కండేయుండు క్రోష్టికిం జెప్పె నని చెప్పిన.

77

టీ. అని, సంస్తుతించినన్ = స్తోత్రము చేయఁగా, అగ్నిదేవుండు = అగ్నిహోత్రుఁడు, అమ్మహీదేవుదేహంబునన్ = ఆబ్రాహ్మణునిశరీరమున, సన్నిహితుండు = ఆసన్నుఁడు, అగుటయు = కాఁగా, అమ్మహాభాగుండు = పూజ్యుఁడగు నాప్రవరుఁడు, గండుమీఱి = బలుపుచెంది, పొడుపుఁగొండన్ = ఉదయపర్వతమున, అఖండ...అంతర్గతుండు - అఖండ = ఎడతెగని, సంధ్యారాగ = సంజవేళయందలి యెఱ్ఱఁదనముయొక్క, ప్రభామండల = కాంతిసమూహముయొక్క, అంతర్గతుండు = లోనున్నవాఁడు, అగు, పుండరీకవనబుధుండునుంబోలెన్ = సూర్యునివలె, ఉత్తప్త...గౌరంబు - ఉత్తప్త = పుటపాకము చేయఁబడిన, కనకద్రవ = కరఁగి నీరై యున్న బంగారుయొక్క, ధారాగౌరంబు = ధారయొక్క పసిమివంటి పసిమి గలది, అగు తనుచ్ఛాయాపూరంబునన్ = శరీరకాంతిప్రవాహముచేత, అక్కానన్ = ఆయడవిని, నిజగమనవిరోధిని = తనప్రయాణమునకు నడ్డు చేయనది అగు, అవ్వరూథిని(యొక్క) హృదయకంజంబునన్ = హృదయపద్మమున, రంజిల్లు...మకరందంబున్ - రంజిల్లు = ఒప్పునట్టి, అమంద = అల్పము కాని, అనురాగరసమకరందంబున్ = ప్రేమరసమను