బడును) నీయందున్ = నీయందె, ఉద్భవించున్ = పుట్టును, (కాన), నన్ను = నీయెడ భక్తిశ్రద్ధలు గలనన్ను, కావవే = ఆపదనుండి కాపాడవయ్యా!
గార్హపత్యాగ్నిలోనుండి వైశ్వదేవాదిక్రియ లొనరించుటకుఁ గైకొని క్రియాపరిసమాప్తివఱకు హోమము చేయునగ్నిని ఆహవనీయ మనియు, ప్రాయశ్చిత్తాదికార్యములకొఱకు వేదికకు దక్షిణభాగమునం దుంచుకొనునగ్నిని దక్షిణాగ్ని యనియు నందురు.
| ఉ. | దానజపాగ్నిహోత్రపరతంత్రుఁడనేని భవత్పదాంబుజ | 76 |
టీ. హవ్యవాహనా = వహ్నిదేవుఁడా! (హవ్యములను వహించువాఁడు అని వ్యుత్పత్తి) దాన...తంత్రుఁడనేనిన్ - దాన, జప, అగ్నిహోత్ర(ములకు), పరతంత్రుఁడనేనిన్ = అధీనుఁడ నగుదునేని, భవ... రతుఁడనేనిన్ - భవత్ = నీయొక్క, పదాంబుజ = పాదపద్మములయొక్క, ధ్యాన(మునందు), రతుండనేనిన్ = ఆసక్తి గలవాఁడ నగుదునేని, పర... దులన్ - పర = ఇతరులయొక్క, దారధనాదులన్ = భార్య ధనము మొదలగువానిని, కోరనేనిన్, సన్మానముతోడన్ = గౌరవముతో, సదనంబునన్ = ఇంట, ఇనుండు= సూర్యుఁడు, పశ్చిమాంభోనిధిలోనన్ = పడమటిసంద్రమున, క్రుంకకయమున్న = మునుఁగకమునుపే, నిల్పుము = చేర్చుము.
సన్మానముతో నిల్లు జేర్పుమనుటచే వరూథినిచే నగౌరవము కాకుండ నిల్లు చేర్పుమని భావము. ప్రొద్దు గ్రుంకకముందె పోవలయు ననుట అగ్నిహోత్రాదిక్రియలు నిర్వర్తించుటకు, రయము వరూథినివలని భయాతిశయమును సూచించును.