తా. ఓభూసురోత్తమా! యజ్ఞములు చేసితిని, తపములు చేసితిని, అంటివి. దయాస్వభావము లేనియప్పు డెన్నిపుణ్యములు చేసిన నేమిఫలము? ఎన్ని యేనిపుణ్యములు చేసినవారు పొందుసద్గతినే యొక్కభూతదయ గలవాఁడు పొందఁగలఁడు. ఇంతమాత్రము చింతింప లేవైతివి. నీచదు వెందులకు? చెప్పు.
అలం. కావ్యలింగము.
| సీ. | వెలిపెట్టిరే బాడబులు పరాశరుఁ బట్టి | |
| తే. | వారికంటెను నీమహత్త్వంబు ఘనమె | 73 |
టీ. బాడబులు = బ్రాహ్మణులు, దాశకన్యాకేళిన్ = దాశరాజుకూఁతురైన మత్స్యగంధియొక్క కలయికను, తప్పుచేసి =తప్పుగాఁ గొని, పరాశరున్ = పరాశరమహామునిని, పట్టి = పట్టుకొని, వెలిపెట్టిరే = బహిష్కరించిరా? గాధిపట్టికిన్ = విశ్వామిత్రునకు, మేనకచుట్టఱికము = మేనకతోడిసంబంధము, కులములోన్, వన్నె తక్కువ = మర్యాద తక్కువైనది, ఆయ్యెనే? ననుపుకాఁడై = అంటుకాఁడై, వేల్పునాగవాసము =అచ్చరగుంపును, కూడి కలసి, (పలువురువేశ్యలను గవసినను) మాందకర్ణి, మహిమ = మహత్వమును, కోల్పడియెనే =