గోరఁజిమ్మినను, విచ్చు = పగలునట్టి, గుబ్బ = గుండ్రని, చనుమిట్టలన్ = గబ్బిగుబ్బలపై, అశ్రులు = కన్నీరు, చిందువందఁగన్ = చిందులుచిందఁగా, కలస్వనంబుతోన్ = అవ్యక్తమధురమగుధ్వనితో, ఏడ్చెన్.
కృపారహితాత్మక యనుటచే నీవొనరించు సత్కృతులన్నియు నిష్ఫలములని సూచన. ఏడ్పు కలస్వనమగుటచేఁ జెలికత్తె లాలింపకపోయిరి. వేదన నిజమైనది కాదు నెపము. చనుమిట్టలను సోకి కన్నీరు చిందె ననుటచే గుబ్బలయుబ్బుబింకము సూచితము.
తా. ఓకటికగుండెవాఁడా, స్త్రీలు పాటునకుఁ దాళుదురా? నీవు త్రోయఁగా నిక్కడ నీగోరు తాఁకెను, చూడు మనుచుఁ (జన్కట్టుపైఁ) జూపి నొప్పి యనుమిష పెట్టుకొని యన్నతస్తనములపైఁ గన్నీరు చిందఁగా నవ్యక్తమధురధ్వనితో నేడ్చెను.
| క. | ఈవిధమున నతికరుణము | 71 |
టీ. వనరుహనేత్ర = (తామరఱేకులవంటి కనులుగల) ఆవరూథిని, అతికరుణముగాన్ = మిక్కిలి జాలి కలుగునట్లు, ఈవిధమునన్ = ఈరీతిగా, కన్నుఁగవధవళరుచుల్ = రెండుకన్నులయొక్కయు దెలికాంతులు, కావి గొనన్ = ఎఱ్ఱవాఱఁగా, ఏడ్చి, వెండియున్ = తిరిగియు, ఆవిప్రకుమారున్ = ఆప్రవరాఖ్యుని, చూచి = తిలకించి, అలమటన్ = విచారముతో, పలికెన్ = ఇటుల వాకొనెను.
కరుణ మన శోకాతిరేకము. ఈయర్థముననే భవభూతి ఉత్తరరామచరిత్రమునందు “పుటపాకప్రతీకాశో రామస్య కరుణో రసః” అనియు, "కరుణస్య మూర్తిరివవా శరీరిణీ విరహవ్యథేవ వనమేతి జానకీ” అనియు