Jump to content

పుట:Manu Charitra.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరీరము, తీరమే = స్థిరమా, ఇట్టి తుచ్ఛముఖముల్ = ఇటువంటినీచసౌఖ్యములు, చెప్పకు = (శ్రేష్ఠము లని నాకు) తెలుపకుము, మీసాలపైన్ తేనియల్ = మీసములమీఁద నిలిచినతేనెచినుకులఁ బోలినవి. మీసములకంటిన తేనె నాలుకకు సోఁకినపు డించుక మధురముగా నుండునుగాని సంపూర్ణముగ మాధుర్య మనుభవించుటకు వీలు కాదు. అటులె పరకాంతారతియుఁ దాత్కాలికసౌఖ్యము. దాని కేల యపేక్షింపరాదన్న అది తుచ్ఛముఖము. మీసాలమీఁది తేనె మీసములఁ దెల్లఁజేయునటుల నీతుచ్ఛసుఖము ఇహపరములకు భంగకరము.

తా. ఉవిదా! ప్రాకస్సాయంసమయములందు హోమద్రవ్యములచేఁ బరితృప్తి చెందునగ్నిదేవుఁడు కలిగించు సౌఖ్యములు, నీ వే మెఱుగుదువు? నాకు నగ్నులు దర్భలు మొదలగునవి ప్రియమ ట్లితరమగునవి కావు. శరీరము నశించిపోవునది. నీచెప్పు నీచసౌఖ్యములు మీసాలపై నిలిచిన తేనెబొట్ల బోలునవి. (అనఁగా, నల్పములును నంతలోఁ దీఱిపోవునవియు నని భావము.)

అలం. వ్యతిరేకము. ప్రతివస్తూపమ.

చ.

అనుటయు మాట లేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరు దేఱు తెలిగన్నుల నాతనిఁ బుల్కుపుల్కునం
గనుఁగొని మాటలం బొదువు గద్గదికం దల యూఁచి యక్కటా
వనిత తనంతఁ దా వలచి వచ్చినఁ జుల్కన గాదె యేరికిన్.

66

టీ. అనుటయున్ = ప్రవరాఖ్యుఁ డిటు లనఁగానే, హృదయాబ్జము = హృదయపద్మము, జల్లనన్ = జల్లు మనఁగా, మోము = ముఖము, వెల్లనై = వెలవెలలాడఁగా, కనలుచున్ = కంటగించుచు, నీరు దేఱు తెలిగన్నులన్ = కన్నీరు గ్రమ్ము తెల్లకన్నులతో, ఆతనిన్, పుల్కుపుల్కునన్ = నీరాఁచుకొని యాఁచుకొని చూచుచూపులతో, కనుఁగొని = చూచి, మాటలన్ = నుడువులయందు, పొదువు గద్గదికన్ = కప్పునట్టి డగ్గుత్తికతో, తల యూఁచి = తల కదలించి, అక్కటా = అయ్యో! వనిత = స్త్రీ, తనంతన్ తాన్ = తనకుఁ దానై, వలచి =