Jump to content

పుట:Manu Charitra.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కిన్ = (వేదాంత)శాస్త్రసూత్రములపంక్తులకు, మీసంప్రదాయారముల్ = పరంపరగా మీలోఁ జెప్పుకొనఁబడు నర్థములు, ఇవే పో = ఇవేయొకో!

త్రయి పాప మనుట, రతి పుణ్య మనుట కామశాస్త్రోపాధ్యాయిని చెప్పఁదగినది. కాన నిటు లర్థము చెప్పుట కాముకసంప్రదాయార్థమే! కాకున్న నెందేని యిట్టియర్థ మెఱుంగకుందుమా?

తా. ఈపాండిత్యము నీకుఁ గాక మఱి యెవ్వరికిని లేదు. “వేదప్రతిపాదితము లగుధర్మములు పాపములు! సంభోగము పుణ్యము!" అనుచు కామశాస్త్రమున నుపాధ్యాయురాలవువలెఁ జెప్పుచున్నావు. బాగు బాగు! వేదాంతసూత్రములకుఁ బరంపరగా మీలోఁ జెప్పుకొను నర్థము లివియే కాఁబోలు.

అలం. వ్యాజస్తుత్యలంకారము.

మ.

తరుణీ రేపును మాపు హవ్యములచేతన్ దృప్తుఁ డౌవహ్ని స
త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగ శక్యమే నీకు నా
కరణుల్ దర్భలు నగ్నులున్ బ్రియము లైన ట్లన్యముల్ గా వొడల్
తిరమే చెప్పకు మిట్టితుచ్ఛసుఖముల్ మీసాలపైఁ దేనియల్.

65

టీ. తరుణీ = ఓ ప్రోయాలా, వరూథినీ! రేపును మాపు = ఉదయాస్తమయకాలములందు, హవ్యములచేతన్ = హోమద్రవ్యముచే, తృప్తుఁడు = పరితోషము చెందినవాఁడు, ఔవహ్ని = అగునట్టి యగ్నిదేవుఁడు, సత్కరుణాదృష్టి = మంచిదయాదృష్టితో, ఒసంగుసౌఖ్యములు = ఇచ్చుసుఖములు, నీకున్ = కేవల కామాంధురాలవగు నీకు, ఎఱుంగన్ = గ్రహించుటకు, తెలిసికొనుటకు, శక్యమే = తరమా? (ఇంత యేల?) నాకున్, అరణుత్ = (అగ్ని పొడముటకు నొకదానిపై నొకటి పెట్టి మథించు) కొయ్యలు, దర్భలున్ = కుశలు, అగ్నులున్ = అగ్నిహోత్రములు, ప్రియములు = ఇష్టములైనవి, ఐనట్లు = అయినరీతిగా, అన్యములు = ఇతరములు, కావు = ఇష్టములు కావు, ఒడల్ =