ముగా ననుట. బాణములు మిగుల వేగముగా లక్ష్యము తొలంగకపోవుటకు వానికి ఈఁకలు కట్టునాచారము గలదు. కాన నాయువుపట్టుల గుఱి తప్పక గాటముగా నాటుచున్న వని భావము. పరిణత...రసంబు - పరిణత = పండిన, వివిధ = నానావిధములగు, విబుధతరు = కల్పవృక్షములవలన, జనిత = పుట్టిన, మధుర = తీయని, మధురసంబు = మద్యమును, ఆనుమదంబు = త్రావుమత్తుయొక్క, అదటునన్ = ఉద్రేకముచే, చిదిమినన్ = నొక్కినను, ఎఱుంగక, మదనహరునైనన్ = శివునైనను, చదురునన్ = నైపుణ్యముచే, కదియన్ = కలియఁటకు, గమకించుతిమురునన్ = యత్నించుపొగరుచేతను, ప్రోడవయసే మదముచేఁ గన్నెఱుంగనీయనిది అందు మద్యమద మున్న నొడలెఱుంగుట కష్టము. ఈ మధురస మట్టిది కాదు. విబుధతరుజన్యము గాన మఱియుఁ గైపు గలిగించు నని భావము. కొమిరెప్రాయంపుమదంబునను = కన్నెప్రాయపుమదముచేతను, అనన్య...మదంబునను - అనన్యకన్యాసామాన్య = ఇతరకన్యలకు లేని, లావణ్యరేఖా = మేనిమిసమిసతీరువలని, మదంబునను = మదముచేతను, ఒంటిపాటునన్, కంటికిన్, ప్రియుండై = ప్రియము గలుగఁజేయువాఁడై, లావణ్య మన సౌందర్యాతిశయముగల వెలఁదుల దేహకాంతి. తల్లక్షణము — శ్లో. “ముక్తాఫలేషు చ్ఛాయాయా స్తరలత్వమివాంతరా, ప్రతిభాతి యదంగేషు లావణ్యం తదిహోచ్యతే.” తంగేటిజుంటిచందంబునన్ = తంగేడుచెట్టునకుఁ బట్టిన తేనెతుట్టెవలె, గొంటుఁదనంబు = దుడుఁకుఁదనమును, ఎఱుంగక, కుఱంగటన్ = చెంగట, ఉన్నయమ్మహీ...మౌగ్ధ్యంబులం జేసి - ఉన్నయమ్మహీసురవరకుమారు = ఉన్నట్టియాలేఁబ్రాయపుబ్రాహ్మణశ్రేష్ఠుని, తారుణ్యమౌగ్ధ్యంబులం జేసి = వయసుచేతను చక్కఁదనముచేతను, తనవైదగ్ధ్యంబు = తననేర్పు, మెఱయన్ = ప్రకాశింప, కల్గె నని, పల్లవించు నుల్లంబు నుల్లాసంబునన్ = చిగిరించు మనస్సుయొక్క సంతోషముచే, కదురు మదంబునన్ = కలుగుమదముచేతను, ఓసరించక = తొలఁగక, చంచల...ప్రభలు - చంచల = బెళికెడు, దృగంచల = కనుఁగొలఁకులయొక్క, ప్రభలు = కాంతులు, అతని
పుట:Manu Charitra.pdf/191
స్వరూపం