తా. ఓజలజాక్షీ! నీవు చెప్పిన సంగతి విషయేచ్ఛలు గలవానికిఁ జెల్లును గాని నిష్కాములమై మోక్షము నపేక్షించు మాబోంట్లకుఁ జెల్లదు. కావున నీమాటలు వలదు. ఎఱిఁగియుంటివా యూరికిఁ జేరుతెరువు తెలిపి పుణ్యము కట్టికొనుము.
| క. | బ్రాహ్మణుఁ డింద్రియవశగతి | 60 |
టీ. బ్రాహ్మణుఁడు = బ్రహ్మజ్ఞానసంపన్నుఁడగువాఁడు, ఇంద్రియవశగతిన్ = ఇంద్రియములకు లోఁబడిన నడువడి గలుగుటచే, జిహ్మా...జిహ్మగములపాలై - జిహ్మాచరణ = వంకరలు కలిగించుటలో, ఏక = ముఖ్యముగా, నిపుణ = నేర్పరి యగు, చిత్తజ = మదనునియొక్క, నిశిత = వాఁడియైన, అజిహ్మగములపాలు ఐ = ములుకులపరమై, బ్రహ్మా...చ్యుతుఁడై - బ్రహ్మానంద = పరమాత్మానుభవమువలనఁ గలిగిన సంతోషముయొక్క, అధిరాజ్య = అధిష్ఠించిన ప్రభుత్వముయొక్క, పదవీ = మార్గమునుండి, చ్యుతుఁడై = జాఱినవాఁడై, (తొలంగి) చెడున్ = నశించును.
తా. బ్రాహ్మణుఁడగువాని కింద్రియనిగ్రహము ముఖ్యముగా నుండఁదగినది. ఇంద్రియనిగ్రహము లేనివాఁడు మోక్షాదు లొందఁజాలఁడు.
అలం. కావ్యలింగము.
| వ. | అనిన నత్తెఱవ యక్కఱకరిపలుకుల కులికి గఱిగఱిం గఱవఁ | |