వాసాదినియమములచే, అగునశనాయాపీడన్ = అగునట్టి క్షుద్బాధచే, (అశనాయాసమునన్ = అగునట్టి ఆహార(వర్జన)శ్రమచేత నని. పా.) ఇంద్రియరోధమునన్ = విషయములందుఁ బ్రవర్తింపనీక పంచేంద్రియములను బిగ్గఁబట్టుటచే, కృశుఁడవు = చిక్కినవాఁడవు, అయి, ఆత్మన్ = జీవాత్మను, అలఁచుట = హింసఁ జేయుట, కుశలతయే = మంచిదా? నేర్పరితనమా?
శరీరానంతరస్వర్గసుఖ మప్సరోంగనాభోగము. సుఖ మెఱుంగఁదగినది దేహము. అది లేని పారలౌకికసౌఖ్యముకంటె నీసశరీరసుఖము గొప్ప దనుట.
తా.ఇప్పటి పుణ్యకర్మములకు ఫలముగా శరీరము విడిచిన పిదప లభింపఁబోవు స్వర్గసౌఖ్య మిప్పు డీశరీరముతోనే లభించుచుండఁగా నింక నుపవాసాదులు చేసి శరీరమును గృశింపఁజేసికొని జీవాత్మను హింస పెట్టుట మంచిదా ?
అలం. కావ్యలింగాలంకారము.
| తే. | అనినఁ బ్రవరుండు నీ వన్న యర్థ మెల్ల | 59 |
టీ. అనినన్ = ఇటులఁ బ్రవరునితో వరూథిని యనఁగా, ప్రవరుఁడు, ఓ జలజాక్షీ = ఓ చిన్నదానా! నీవు + అన్నయర్థము = నీచెప్పినవిషయము, ఎల్లన్ = అంతయు, కాముకుఁడు = విషయాపేక్ష గలవాఁడు, ఐనవానికిన్ = అయినట్టి, కామునకునకు, నిజము = (అపేక్షితమగుట) సత్యము. అకాముఁడు = విషయాపేక్ష లేనివాఁడు, ఇది = ఈయంశమును, గణించునె = లెక్క చేయునా? కాముకుఁడు కానివాని కీసౌఖ్యము వర్జనీయ మనుట. ఎఱిఁగితేని = నీ వెఱింగియున్నపక్షమున, నగరమార్గంబు = పట్టణమునకుఁ బోవుత్రోవను, చూపి = చూపించి, పుణ్యమునఁ బొమ్ము = పుణ్యము కట్టుకొనుము. ప్రవరాఖ్యుఁడు కడకు విసికి నీమాటలు కాముకులను గూర్చినవి. నావి కావు. త్రోవయే ని న్నడుగునది యనెను.