లందుఁ గడపినచో నింక విషయసుఖముల ననుభవించుట యెన్నఁడు? అనేకయజ్ఞములు చేసి పవిత్రు లగుటకు ఫలము మాకవుఁగిలింతలఁ జిక్కి సౌఖ్యము నందుటయే గదా! (యజ్ఞములు చేసినవారు స్వర్గమున నప్సరస్సంగతిఁ జెందుదురని శ్రుతులు.)
| సీ. | సద్యోవినిర్భిన్నసారంగనాభికా | |
| తే. | వివిధకుసుమకదంబంబు దివిజతరుజ | 55 |
టీ. ఇందు = ఇక్కడ (ఈ ప్రదేశమగు మంచుమలయందు), సద్యో...హృతమై - సద్యః = అప్పుడే, వినిర్భిన్న = చిట్లిన, సారంగనాభికా = కస్తూరిమృగముయొక్క బొడ్డునుండి, హృతమై = కైకొనఁబడినదై, (హరింపఁబడినదై) పిసాళించు మృగమదంబు = పరిమళించుకస్తూరియును, కసటు = ముఱికి, పోన్ = పోవునట్లు, బీఱెండన్ = తీవ్రమైన యెండచే, కరఁగి = నీరుగా ద్రవించి, కఱ్ఱలన్ = కఱ్ఱపుల్లలందు, అంటి = అంటుకొని, గమగమ వలచు చొక్కపుజవాజి = గమగమ సువాసన కొట్టు నిద్దపుజవ్వాజియును, పొరలెత్తి = పొరలూడి, ఘనసారతరువులన్ = కర్పూరపుటనఁటిచెట్లనుండి,