Jump to content

పుట:Manu Charitra.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. అగ్నికార్యమును దేవతార్చనమును మిగిలి యున్నవి. భోజనకాల మతిక్రమించెను. తల్లిదండ్రులు మిగుల ముదుసళ్లు. ఆకలితో నసురుసు రనుచు నాకై యెదురుచూచుచుందురు. నే నాహితాగ్నిని నేఁ డిల్లు చేరకుండినచో సర్వధర్మములుఁ జెడును.

ఉ.

నావుడు విన్నఁబాటు వదనంబున నించుక దోఁపఁ బల్కె నో
భావజరూప యిట్టియెలప్రాయము వైదికకర్మనిష్ఠలన్
బోవఁగ నింక భోగములఁ బొందుట యెన్నఁడు యజ్ఞకోటులం
బావను లౌటకున్ ఫలము మాకవుఁగిళ్ల సుఖించుటే కదా.

54

టీ. నావుడున్ = అనఁగా, వదనంబునన్ = ముఖమున, ఇంచుక = కొంచెము, విన్నఁబాటు = విన్నపోవుట, తోఁపన్ = ఎఱుకపడఁగా, (వరూథిని) పల్కెన్, ఓభావజరూప = మన్మథునిరూపువంటిచూపుగలవాఁడా! ఇట్టి యెలప్రాయము = ఇటువంటి చిఱుతవయసు, వైదికకర్మనిష్ఠలన్ = వేదప్రతిపాదితములగు కర్మముల ననుష్ఠించుటలందు, పోవఁగన్ = గడచిపోవుచున్నయెడల, ఇంకన్ = ఇంకన్, భోగములన్ = సుఖములను, పొందుట = అనుభవించుట, ఎన్నఁడు = ఎప్పుడు? వయస్సు తీఱినపిదప నీసుఖములం బడయనగునా? యజ్ఞకోటులన్ = యజ్ఞసమూహములచే, పావను లౌటకున్ = పవిత్రు లగుటకు, ఫలము = ప్రయోజనము, మాకవుఁగిళ్ల = మాయాలింగనములయందు, సుఖించుటేకదా = సౌఖ్యముల నొందుటయేగదా! (పా. సుఖింపనేగదా = సుఖించుటకేకదా.)

నిష్ణాపరులు యజ్ఞములు గావించుచున్నారు. యజ్ఞఫలము అప్సరఃకాంతాసమాగమము. అప్రయత్నముగా నెలప్రాయమున వేల్పుచెలువ సిద్ధించుచుండ నిరాకరించుట ప్రమాద మనుట.

తా. అనఁగా వరూథిని కొంచెము ముఖము చిన్నపుచ్చుకొని యిట్లనియెను. ఓమదనసుందరమూర్తీ! ఇట్టి లేఁబ్రాయము వైదికకర్మానుష్ఠానము