Jump to content

పుట:Manu Charitra.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిలయంబులకున్ = మీగుడిసెకొంపలకు, రత్నకందరములు = మణిమయము లగుగుహలు, నందనచందనోత్కరంబు = ఉద్యానములందలి మంచిగంధపుమ్రాఁకులు, ఇక్కడి, గాంగసైకతములు = గంగానదిలోని యిసుకదిన్నెలును, లవలీనికుంజముల్ = వెన్నెలతీగల పొదరిండ్లును, సరిరాకపోయెనే = సమానము కాకపోయెనా?

రత్నకందరము లుపభోగయోగ్యములు. లవలీనికుంజములుగూడ నట్టివి. శైలవిహారసమయమున గుహలందును వనవిహారమున బొదరిండ్లను గ్రీడింపవచ్చు ననుట. నందనోద్యానభూమియు గాంగసైకతము ఉపభోగోచితము లనుటకు —

సీ. “నందనోద్యానమందారకచ్ఛాయల విశ్రమింపఁగ నీకు వేడ్క గాదె,
    మందాకినీపాండుమహితసైకతములఁ గ్రీడ సల్పఁగ నీకుఁ బ్రియముగాదె.”

శృం. నై. ఆ. 3.

లవలీనికుంజములందుఁ బ్రసవసుగంధము వెల్లివిరియుచుంటచేఁ గామోద్దీపకము. లవలీనికుంజములు సుగంధబంధురము లనుటకు —

    "... ... ... ... ... ... ......................ఒక్కచో వినూ
     తనలవలీలతావళుల తావులఁ దావలమైన తావులన్."

వసు. ద్వి.28.

తా. కాలాఁగక యూరూ రనుచుఁ బలవరించెద వేమి యూరయ్యా అది ? ఇక్కడి యీమణికందరములు, గంధపుమ్రాఁకుదోఁటలు, ఇక్కడి గంగానదీసైకతములు, ఇక్కడి వెన్నెలతీవపొదరిండ్లు మీగుడిసెకొంపలకు సాటి రాలేదా?

ఉ.

నిక్కము దాఁప నేల ధరణీసుతనందన యింక నీపయిన్
జిక్కె మనంబు నాకు ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో
చొక్కి మరందమద్యములచూఱలఁబాటలు వాడుతేంట్లసొం
పెక్కినయట్టిపూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో.

51