మానిని = ఓయువతీ, మీమహత్త్వముల్ = మీప్రభావములు, దివ్యముల్ = అమానుషములైనవి. మదిన్ = మనస్సునందు, తలంచినన్ = విచారింపఁగా, మీకున్, అసాధ్యముల్ = సాధింపరానివి, ఎందున్ = ఏప్రదేశమునందును, కొనము = చూడఁబోము, కానన్ = కావున, తల్లి = అమ్మా! ప్రజల = నావారైనజనులను, ననుఁ గూర్పుము = నన్నుఁ బ్రజలలోఁ బడవేయుము. అటన్నన్ = అనఁగా, లేఁతనవ్వు = చిఱునవ్వు, ఆననసీమన్ = ముఖప్రదేశమున, తోఁపన్ = పొడమఁగా, ధవళాయతలోచన = తెల్లనివిశాలములైన కన్నులుగల యావరూథిని, వానికిన్ = ఆప్రవరాఖ్యునకు, ఇట్లు = ఈవిధముగా, అనున్ = పలికెను.
చూపులను దెల్లఁగను గనులను దెల్లఁగను జెప్పుట కవిసమయము. కనులలోఁ బాపగలభాగముకంటెఁ దెల్లనిభాగ మెక్కువగుటచేఁ బ్రాయికముగఁ దెలికన్ను లనుట గలదు.
విరాటపర్వము
తా. తల్లీ! నే నింక నిల్లు చేరుట కుపాయము తెలుపుము. మీమాహాత్మ్యము లద్భుతము లైనవి. మీ కసాధ్యము లెందును లేవు. నన్నుఁ బ్రజలలోఁ బడవేయుము. అని ప్రవరుఁడు ప్రార్థింపఁగాఁ జిఱునవ్వు నవ్వుచు నావరూథిని యతని కిట్లనియె.
| ఉ. | ఎక్కడియూరు కాల్ నిలువ కింటికిఁ బోయెద నంచుఁ బల్కె దీ | 50 |
టీ. ఎక్కడియూరు = (ఊరుఊ రని పలవరించెద వేమి యూరయ్యా అది?) కా ల్నిలువక = అడుగు నిల్వక, ఇంటికి పోయెదనంచున్ = స్వగృహమునకుఁ బోవలయు ననుచు, పల్కెదు = చెప్పెదవు, అక్కట = అయ్యో! మీకుటీర