Jump to content

పుట:Manu Charitra.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దరీభాగంబులన్ = గుహాప్రదేశములతో, పొల్చునిమ్మిహికాహార్యమునన్ = ఒప్పునట్టి యీహిమవత్పర్వతమున, ఎపుడున్ = ఎల్లపుడును, ప్రేమన్ = అనురాగాతిశయముతో, చరింతుము = సంచరించెదము. నభోవా...తుందిలంబులు - నభోవాహినీ = ఆకాశగంగయొక్క, లహరీ = ప్రవాహమువలన, శీతల = చల్లనైన, గంధవాహ = వాయువుతో, పరిఖేత్ = కలయఁదిరుగుచున్న, మంజరీసౌరభ = పూగుత్తులపరిమళముయొక్క, గ్రహణ = గ్రహించుట గల, ఇందిందిర = తుమ్మెదలచే, తుందిలంబులు = నిండినవి (అగు) ఇవి, మత్కాంతారసంతానముల్ = మాయుద్యానసమూహములు.

తుమ్మెదలు మకరందము గ్రోలుటచేఁ బూవులసొంపు చెడును. కాననే కాళిదాసుఁడు శిరీషముల “ఈషత్ చుంబితాని భ్రమరైః" అని చెప్పెను. ఆకాశగంగ నుండి వలిగాలి వీచినంత దీవెలు కదులును. ఆకదలికచేఁ బొడమినతావిచేఁ దుమ్మెదలు బలిసియున్నవి. దీనిచేఁ బ్రసవసమృద్ధియు నుద్యానసౌభాగ్యాతిశయము నీవె గుర్తింపు మనుట.

తా. అనేకకాంతులతో నిండినగుహలు గలయీహిమవంతమున నెప్పుడును జరించుచుందుము. గంగాతరంగములమీఁదినుండి వచ్చుటచేఁ జల్లనయినగాలిచేఁ గలయఁ బ్రాఁకుపూగుత్తులపరిమళము సవపట్టి చరించుతుమ్మెదలతో నిండిన యీప్రదేశములు మాయుద్యానములు.

క.

భూసురకైతవకుసుమశ
రాసన! మాయింటివింద వైతివి గైకొ
మ్మా సముదంచన్మణిభవ
నాసీనత సేద దేఱి యాతిథ్యంబున్.

46

టీ. భూసురకైతవకుసుమశరాసన = బ్రాహ్మణమిషమున నున్న మన్మథుఁడా! (లేక) కైతవకుసుమశరాసన = కపటమన్మథుఁడ వగు, భూసుర = బ్రాహ్మణుఁడా! మాయింటివిందవు = బందుగుఁడవు, ఐతివి, సముదంచన్మణి