Jump to content

పుట:Manu Charitra.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వీణాగానముచేతను, కంఠగానముచేతను, ఱాళ్లను సైతము కరఁగించు నట్టిరక్తి గలసంగీతము మానేర్చినవిద్య. కామశాస్త్రసిద్ధాంతములను బఠించుట మాకుఁ జిన్ననాఁటనుండియు నలవా టయినది. అశ్వమేధరాజసూయాదియజ్ఞములు చేయువారి కేము దక్కుదుము. మేరుపర్వతమునఁ గల్పవృక్షములనీడలను బచ్చఱాళ్లచరియలపై మేము కూటము దీర్తుము. బ్రహ్మవిష్ణుమహేశ్వరులసభలు మాకు నాట్యశాలలు (మేము అచ్చరల మనుట.)

క.

పేరు వరూథిని విప్రకు
మార! ఘృతాచీతిలోత్తమాహరిణీహే
మారంభాశశిరేఖలు
దారగుణాఢ్యలు మదీయ లగుప్రాణసఖుల్.

44

టీ. విప్రకుమార = ఓ బ్రాహ్మణయువకుఁడా ! పేరు వరూథిని = నానామధేయము వరూథిని యని, ఉదారగుణాఢ్యలు = గొప్పగుణములుగల ఘృతాచీ, తిలోత్తమా, హరిణీ, హేమా, రంభా, శశిరేఖలు, మదీయలు = నా కిష్టురాండ్రయిన, ప్రాణసఖుల్ = ప్రాణపదములగు చెలిమికత్తెలు.

విప్రకుమార యనుసంబోధనము సాభిప్రాయము. ఉదారాతిశయలగు తిలోత్తమాదులు నాప్రాణసఖులుగాన నాయోగ్యత నీవ గమనింపఁగలవు. నేను వరూథినిని. నన్ను నీ వెఱుంగవేని సుప్రసిద్ధలగు తిలోత్తమాదులనైన నెఱింగియుందువుగాన వారినిబట్టి నాయోగ్యతాదికములు గ్రహింపు మని భావము.

మ.

బహురత్నద్యుతి మేదురోదరదరీభాగంబులన్ బొల్చు ని
మ్మిహికాహార్యమునన్ జరింతు మెపుడుం బ్రేమన్ నభోవాహినీ
లహరీశీతలగంధవాహపరిఖేలన్మంజరీసౌరభ
గ్రహణేందిందిరతుందిలంబు లివి మత్కాంతారసంతానముల్.

45

టీ. బహు...భాగంబులన్ - బహురత్న = అనేకరత్నములయొక్క, ద్యుతి = కాంతితో, మేదుర = సాంద్రమయిన, ఉదర = మధ్యదేశములు గల,