| తే. | గనకనగసీమఁ గల్పవృక్షములనీడఁ | 43 |
టీ. గోత్రామరేంద్ర = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా! చిన్నివెన్నెలకందు = ముద్దుల లేఁజందురుని, వెన్ను దన్ని = వెన్నాఁడి (వెంటనే యనుట,) సుధాబ్ధిన్ = పాలసముద్రమున, పొడమిన చెలువ = పుట్టిన స్త్రీ, (లక్ష్మీదేవి యనుట) మాకున్, తోఁబుట్టు = కూడఁబుట్టినది, రహి = రక్తి, పుట్టన్ = పుట్టునట్లు, జంత్రగాత్రములన్ = వీణాగానముచేతను కంఠగానముచేతను, ఱాల్ = ఱాళ్లను, కరఁగించు విమలగాంధర్వంబు = కరఁగఁజేయు చక్కనిసంగీతము, మాకున్, విద్య = చదువు, ననవిల్తుశాస్త్రంపుమినుకులు = కామశాస్త్రపువాక్కులు, ఆవర్తించుపని = వల్లె వేయుపని, మాకున్, వెన్నతోడఁ బెట్టినది = చిన్ననాఁటినుండి యభ్యస్తమైనది, (పసితనమున వెన్న దినుట యలవాటు చేసినటుల మిగులఁ జిన్నతనముననే యభ్యసించిన దనుట) హయమేధ రాజసూయములు= అశ్వమేధము రాజసూయము, అనన్ = అని, పేర్పడ్డ సవనతంత్రంబులు = ప్రసిద్ధి కెక్కిన యజ్ఞతంత్రములు, మాకున్, ఉంకువలు = (పెండ్లికిముందు కన్నెయింటివారికి నిచ్చెడుసొమ్ము) ఓలిధనము, కనకనగసీమన్ = మేరుపర్వతప్రదేశమున, కల్పవృక్షములనీడ, పచ్చఱాచట్టుగమి = గారుత్మతమణివికారములైనపఱపుఱాళ్లసమూహము, రచ్చపట్టు = సభాస్థానము, పద్మసంభవవైకుంఠభర్గసభలు = బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సభలు, మాకున్, సాముగరిడీలు = సాము నేర్చుకొను కూటములు.
ఱాయి శబ్దము సమాసములందుఁ దుదివర్ణము లోపించును. కాన ఱాయి+చట్టు, రాచట్టు అయినది. ఇది రేయి ప్రభృతులలోనిది.
తా. (దేవతాస్త్రీ ప్రవరునితో ననుచున్నది) ఓ భూసురోత్తమా! పాలసంద్రమునందు బాలచంద్రునివెనుకఁ బుట్టిన లక్ష్మి మాకుఁ దోఁబుట్టువు.