యొకత్రోవ గానోపు ననుట ఏకాంత మనుట యథేచ్చావిహారభోగోచితప్రదేశ మనియు జవరాల నని చెప్పుకొనుట సంభోగోచితయౌవనవిభవ ననియు సూచించుట.
తా. ఓవిప్రుఁడా? చేరెఁడేసి కన్నులు పెట్టుకొని యితరులను ద్రోవ యడిగెద వేమి? ఒంటరిపాటున నున్న వయసుఁగత్తెలను పల్కరించువిధమేకాని యీవఱకు వచ్చినత్రోవ నీ వెఱుఁగవేమి? పలుమాట లేల? ఇంత భయము లేకుండ మ మ్మడుగుటకు మేము నీకుఁ జులుకనగా నగపడితిమి గాఁబోలు.
అలం. అపహ్నవాలంకారము.
| వ. | అని నర్మగర్భంబుగాఁ బలికి క్రమ్మఱ నమ్మగువ యమ్మహీ | 42 |
టీ. అని = ఈవిధముగా నని, నర్మగర్భంబుగాన్ = పరిహాసగర్భితముగా, (తన యభిప్రాయమును మరుగుపఱచి యెదటివానికి సరసముగాఁ దోఁచునటుల మాటలాడుట) పలికి = మాటలాడి, క్రమ్మఱన్ = మరల, అమ్మగువ = ఆస్త్రీ, అమ్మహీనురునకున్ = ఆబ్రాహ్మణునకు, ఇ ట్లనియెన్ = ఈవిధముగా బదులు చెప్పెను.
| సీ. | చిన్నివెన్నెలకందు వెన్ను దన్ని సుఖాబ్ధిఁ | |