క్రొవ్వెక్కి యీకొండకు వచ్చి త్రోవ దప్పితిని. ఏవిధమున నేను బురము చేరఁగలుగుదును? తెల్పుమా నీకుఁ బుణ్య మగును.
| క. | అని తనకథ నెఱిఁగించినఁ | 40 |
టీ. అని, తనకథన్, ఎఱిఁగించిన, వనిత, తనకనుఁగవమెఱుఁగులు = తనకన్నుదోయితళతళలు, ఉబ్బన్ = ఉఱుకఁగా, తాటంకములున్ = కమ్మలును, చనుఁగవయు, నడుమున్, వడఁకఁగ , సెలవివాఱన్ = పెదవిమూలలు వెడలునట్లు, నవ్వి, వానికిన్ = ఆతనికి, అనియెన్ = ఈవిధముగా జెప్పెను.
| ఉ. | ఇంతలు కన్ను లుండఁ దెరు వెవ్వరి వేఁడెదు భూసురేంద్ర యే | 41 |
టీ. భూసురేంద్ర = బ్రాహ్మణశ్రేష్ఠుఁడా, ఇంతలు = (చేరఁజూపుచు) ఇంతవిశాలమయిన, కన్నులు, ఉండన్, తెరువు = మార్గము, ఎవ్వరిన్ వేఁడెదు = ఎవరిని యాచించెదవు? నెపం బిడి = (ఈయడుగుట యను) మిష పెట్టుకొని, ఏకాంతమునందున్ = రహఃప్రదేశమున, ఉన్న, జవరాండ్రన్ = వయసుఁగత్తెలను, పల్కరించులాగు = మాటాడించువిధము, ఇంతియకాక = అంతే కాని, మును = ఈవఱకు, వచ్చినత్రోవచొప్పు = ఏతెంచినత్రోవజాడ, ఎఱుఁగవే, ఇంతభయంబు లేక, అడుగన్, ఎల్లిదమైతిమి ఏ = తేలి కయితిమా, మాటలు, ఏటికిన్. ఇంతలు కన్ను లనుటచేఁ బ్రవరుని నయనవైశాల్యమునకు మెచ్చె నని భావము. నెప మనుటచే నీవు రసికుఁడవు రసికతాప్రకటన కిది