| | ప్రతిఘటించు చిగుళ్లపై నెఱ్ఱవాఱిన | |
| తే. | నేరెటేటియసల్ తెచ్చి నీరజాప్తు | 36 |
టీ. (ఈపద్యమునందుఁ బ్రవరునిసౌందర్య మభివర్ణితము) వీనికన్నులు = ఈపురుషునినయనములు, వదన...కమలంబులనన్ - వదన = ముఖముయొక్క, ప్రభూత = అధికమైన, లావణ్య = మెఱు పనెడు (ముత్తెములనిగనిగఁ బోలిన యంగకములనిగారమునకు లావణ్య మని పేరు.) అంబు = ఉదకమున, సంభూత = పుట్టిన, కమలంబులు - తామరలు, అనన్ = అనునట్లు, అమరున్ = ఒప్పును, వీనిఘనభుజములు = ఈబ్రాహ్మణుని గొప్పభుజములు (ఎగుబుజములు), నిక్కి = ఎగుపు చెంది, వీనులతోడన్ = చెవులతో, ఎక్కసక్కెములు = వేళాకోళములు ఆడుకరణిన్, ఉన్నవి. సంకల్ప...పీఠికవోలెన్ - సంకల్పసంభవ = మన్మథునియొక్క, ఆస్థానపీఠికవోలెన్ = కొల్వుగద్దియవలె, వెడఁదయై = విశాలమై, వీనియురము = ఈతనివక్షస్థలము, కనుపట్టు = కనవచ్చుచుందురు, ప్రతిఘటించు = ఎదిరించునట్టి, చిగుళ్లపైన్ = చివుళులపై, ఎఱ్ఱవాఱినరీతిన్ = కనలి యెఱ్ఱవాఱినవిధమున, మృదుపదముఁలు = మెత్తనిపాదములు, ఉన్నవి = ఎఱ్ఱగా నలరారుచున్నవి, పద్మభవుఁడు = బ్రహ్మదేవుఁడు, నేరెటేటియసల్ = జంబూనదియందలిబురద, తెచ్చి (జంబూనదిలోనియడుసు బంగా రని చెప్పఁబడును), నీరజాప్తున్ = సూర్యుని, సానఁబట్టిన రాపొడి = సానఁబట్టి బింబమును దేర్చునప్పు డరిగి రాలిన రజము, చల్లి, మెదిపి = కలయఁగలిపి, పదను = (ముద్దపాకమునకుఁ గావలసిన) తడిని, సుధన్ = అమృతమున, ఇడి, చేసెనో = సృష్టించె